HBD SOBHAN BABU VETERN TOLLYWOOD STAR HERO SOBHAN BABU PROPERTIES AND ASSETS PK AT THE TIME OF HIS DEATH TA
Sobhan Babu: చనిపోయేనాటికి శోభన్ బాబుకు అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా... ?
శోభన్ బాబు (File/Photo)
Sobhan Babu Birth Anniversary | తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఇప్పటికీ ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు..
Sobhan Babu Birth Anniversary | తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. ఇప్పటికీ ఈయనను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే.. టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. అంతేకాదు..యూట్యూబ్లో కూడా ఈ సినిమాలకు గిరాకీ ఎక్కువే. అంతేకాదు సినిమాలకూ ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన అందగాడు.ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు.. ఇకపై ఎవరికీ రాదు కూడా. అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్లో రిలీజైతే.. ఆడవాళ్లు జాతర జరిగేది. అంతేకాదు ఈయన సినిమాలకు స్పెషల్గా ఆడవాళ్లకు ఒక టికెట్ ఇచ్చేవారు. మగవాళ్లకు రెండు టికెట్స్ ఇచ్చేవారని అప్పట్లో కొన్ని పత్రికలు పేర్కొన్నాయంటే.. మహిళ ప్రేక్షక లోకంలో ఈయన ఫాలోయింగ్ ఏంటో చెప్పకనే చెప్పింది. అప్పట్లో శోభన్ బాబు చనిపోయినపుడు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలు కూడా మా ఇంట్లో ఎంతో మంది హీరోలున్న మా ఇంటి ఆడవాళ్లకు హీరోగా శోభన్ బాబు సినిమాలు అంటేనే ఇష్టం అని చెప్పడం గమనార్హం.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు కూడా ఉంది. ఈయన ఎంత పెద్ద హీరోనో అంతకంటే పెద్ద రియల్ బిజినెస్ మ్యాన్ కూడా. ఈ రోజు సౌత్ ఇండియాలో శోభన్ బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు.. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అన్ని వేల కోట్ల ఆస్తులున్న హీరో మరొకరు లేరనే టాక్ ఉంది.
శోభన్ బాబు ఆస్తులపై మురళీ మోహన్ వివరణ (sobhan babu assets)
ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు.. ఆయన స్నేహితుడు మురళీ మోహన్. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినపుడు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు మురళీ మోహన్. మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పాడాయన. ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు రూ. 80 వేల కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు. 1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ తీసుకున్నాడని.. అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికీ తెలియదని.. అలాంటి సమయంలోనే శోభన్ బాబు బిజినెస్ చేసేవాడని చెప్పాడు మురళీ మోహన్.
శోభన్ బాబు ఆస్తులపై మురళీ మోహన్ వివరణ (sobhan babu assets)
ఈ రోజుకు కూడా చెన్నైలో.. చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. ఆయన స్పూర్థితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టినట్లు చెప్పాడు ఈయన. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన సన్నిహితులకు చెప్పేవాడని.. అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు మురళీ మోహన్. శోభన్ బాబు ఆస్తిని ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం అంటున్నాడు ఈయన.
శోభన్ బాబు ఆస్తులపై మురళీ మోహన్ వివరణ (sobhan babu assets)
షేర్స్, బిజినెస్ అలా ఎన్నో చేసాడని.. మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని.. దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి అంటూ కొంత మంది సినీ విశ్లేషకులు చెబుతుంటారు. మొత్తానికి దక్షిణాదిన కాదు.. ఇండియాలోనే శోభన్ బాబు కంటే ఆస్తిపరుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని బల్లగుద్ది మరీ చెప్పాడు మురళీ మోహన్.