Happy Birthday Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో మెగాభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. శనివారం రామ్ చరణ్ 36వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అపుడే సంబరాలు మొదలు పెట్టేసారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ ట్రిబ్యూట్ సాంగ్ అంటూ ఓ పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్‌ను మెగా ఫ్యాన్స్ కొంత మంది కలిసి రూపొందించారు. ‘చిరుతతో అడుగెట్టి.. మగధీరతో హిట్టు కొట్టి అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ను ఎస్జేపీ రాసి పాడారు. ది డ్రాఫ్లెట్జ్ సంగీతం అందించారు. ఈ పాటను సుమంత కొప్పరావూరి, దగ్గుశెట్టి సుజయ్ బాబు ప్రొడ్యూస్ చేసారు. మధుర ఆడియో ఈ సాంగ్‌ను విడుదల చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు రామ్ చరణ్.. తన తండ్రితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను మే 13న విడుదల కానుంది.
రామ్ చరణ్ (Twitter/Photo)
రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తండ్రి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. తొలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన రెండో సినిమా ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి వరుసగా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో వరుస చిత్రాలను నిర్మిస్తూ.. హీరోగా.. అటు నిర్మాతగా దూసుకుపోతున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.