హోమ్ /వార్తలు /సినిమా /

HBD Namrata - Upasana: నమ్రతకు ఉపాసన బర్త్ డే విషెస్.. స్పెషల్ పిక్ షేర్ చేసిన మెగా కోడలు..

HBD Namrata - Upasana: నమ్రతకు ఉపాసన బర్త్ డే విషెస్.. స్పెషల్ పిక్ షేర్ చేసిన మెగా కోడలు..

నమ్రతకు ఉపాసన కొణిదెల బర్త్ డే విషెష్ (Twitter/Photo)

నమ్రతకు ఉపాసన కొణిదెల బర్త్ డే విషెష్ (Twitter/Photo)

HBD Namrata - Upasana Konidela Kamineni | సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి.. ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు.

  HBD Namrata - Upasana Konidela Kamineni | సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి.. ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ రోజు నమ్రత.. 49వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సినిమాల్లో రాకముందు.. మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అలా 1993లో నమ్రత మిస్ ఇండియాగా ఎంపికైంది. ఆ తర్వాత పలు  ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. తెలుగులో తన తొలి హీరో అయిన మహేష్ బాబునే ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2005 ఫిబ్రవరిలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. ఆ సంగతి పక్కన పెడితే.. నమ్రత పుట్టినరోజు చాలా మంది సెలబ్రిటీలు మహేష్ బాబు భార్య నమ్రతకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

  తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికగా నమ్రతకు బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా నమ్రతతో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను మహేష్ బాబు అభిమానులతో పాటు మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

  మహేష్ బాబు భార్య నమ్రతకు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మంచి మిత్రులు. వీళ్లిద్దరి భర్తల మధ్య వృత్తిగతంగా పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. మరోవైపు నమ్రత.. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు పిల్లలు సితార, గౌతమ్ కృష్ణ ఆలనా పాలనా చూసుకుంటూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ నెల 25న  ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం కానుంది. అటు ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ‘ఆచార్య’ సిద్ద పాత్రలో నటిస్తున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh Babu, Namrata, Ram Charan, Tollywood, Upasana kamineni

  ఉత్తమ కథలు