Janhvi Kapoor- Khushi Kapoor: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇవాళ 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు అభినందనలు చెబుతున్నారు. కాగా జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోదరి ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. జాన్వీతో తీసుకున్న ఫొటోలతో పాటు చిన్న వయస్సులో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోను ఖుషీ షేర్ చేశారు. దానికి హ్యాపీ బర్త్‌డే టు మై ఎవ్రీ థింగ్ అని ఖుషీ కామెంట్ పెట్టారు. కాగా ఖుషీ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలో చిన్న వయస్సులో జాన్వీ డ్యాన్స్‌తో అదరగొట్టేస్తుంది. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు మొహంలో భావాలను పలికిస్తోంది. ఇక ఈ వీడియో జాన్వీ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
కాగా దఢక్ మూవీతో జాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న జాన్వీ.. ఆ తరువాత గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటించింది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక రాజ్‌కుమార్ రావు, వరుణ్ శర్మలతో కలిసి జాన్వీ నటించిన రూహీ మూవీ మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది.
View this post on Instagram
వీటితో పాటు దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీలో నటిస్తుంది జాన్వీ. ఇక కరణ్ జోహార్ దర్శకనిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం తక్త్‌లోనూ జాన్వీ నటించనున్నట్లు ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన ఈ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.