• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HBD HRITHIK ROSHAN RAKESH ROSHAN REVEALS HIS SON AS CHILD ACTOR MNJ

HBD Hrithik Roshan: ఆ రోజే హృతిక్ గొప్ప హీరో అవుతాడ‌నిపించింది.. కుమారుడిపై రాకేష్ రోష‌న్ కామెంట్లు

HBD Hrithik Roshan: ఆ రోజే హృతిక్ గొప్ప హీరో అవుతాడ‌నిపించింది.. కుమారుడిపై రాకేష్ రోష‌న్ కామెంట్లు

హృతిక్ రోషన్ (File/Photo)

బాలీవుడ్ గ్రీకు వీరుడు, స్టైలిష్ యాక్ట‌ర్ హృతిక్ రోష‌న్(Hrithik Roshan) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే సినీ ఇండ‌స్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లో నిల‌దొక్కుకునేందుకు హృతిక్ చాలా క‌ష్టాలే ప‌డ్డాడు

  • Share this:
    Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకు వీరుడు, స్టైలిష్ యాక్ట‌ర్ హృతిక్ రోష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే సినీ ఇండ‌స్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లో నిల‌దొక్కుకునేందుకు హృతిక్ చాలా క‌ష్టాలే ప‌డ్డాడు. అంతేనా ఒకానొక స్టేజ్‌లో బెడ్‌కి ప‌రిమిత‌మైన హృతిక్.. త‌రువాత మ‌ళ్లీ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి తానేంటో నిరూపించుకున్నారు, ఇప్ప‌టికీ నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే హీరోగా మార‌క‌ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించారు హృతిక్. అందులో ర‌జ‌నీకాంత్, శ్రీదేవి, రాకేష్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జె.ఓం ప్ర‌కాష్(హృతిక్ తాత‌) తెర‌కెక్కించిన భ‌గ‌వాన్ దాదా మూవీ ఒక‌టి. ఇక ఈ మూవీ షూటింగ్‌లో హృతిక్ న‌ట‌న‌ను గురించి ఆయ‌న తండ్రి రాకేష్ రోష‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.

    ఈ మూవీలో మామూలుగా హృతిక్ రోష‌న్ న‌టించాల్సింది కాద‌ట‌. ఆ రోజు రావాల్సిన చైల్డ్ ఆర్టిస్ట్ సెట్స్‌కి రాక‌పోవ‌డంతో హృతిక్‌ని తీసుకుర‌మ్మ‌ని ఓం ప్ర‌కాష్.. రాకేష్‌కి చెప్పార‌ట‌. అయితే తాను చ‌దువుకుంటున్నాడ‌ని, అస‌లు వ‌ద్ద‌ని రాకేష్ అన్నార‌ట‌. కానీ ఓం ప్ర‌కాష్ బ‌ల‌వంతం మీద హృతిక్‌ని సెట్స్‌కి తీసుకొచ్చార‌ట‌. ఇక హృతిక్‌పై షూటింగ్ ప్రారంభించిన‌ప్పుడు తన మ‌న‌సులో ఏదో తెలియ‌ని భ‌యం అనిపించి, దూరంగా నిల్చున్నాన‌ని.. కానీ కెమెరా పెట్ట‌గానే హృతిక్ త‌న‌లోని న‌టుడిని బ‌య‌ట‌కు తీసుకొచ్చాడ‌ని గుర్తుచేసుకున్నారు.

    ఆ సినిమాలో హృతిక్ చ‌నిపోవాలి. అప్ప‌టికి హృతిక్ వ‌య‌స్సు 9 సంవ‌త్స‌రాలు. అస‌లు ఆ పాత్ర‌ను ఎలా చేస్తాడా..? అన్న భ‌యం నాలో ఉండేది. కానీ షూటింగ్ చూసిన త‌రువాత నాకు అనిపించింది హృతిక్ మంచి న‌టుడు అవుతాడ‌ని అని భ‌గ‌వాన్ దాదా రోజుల‌ను గుర్తు చేసుకున్నారు రాకేష్ రోష‌న్‌. ఇక త‌న కుమారుడు ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించినా ఏం కాద‌ని, అయితే తాను మాత్రం త‌న కుమారుడితో తప్ప ఎవ్వరితో సినిమాలు తీయ‌న‌ని రాకేష్ రోష‌న్ స్ప‌ష్టం చేశారు. త‌మ కుమారుడు సంతోషంగా ఉండ‌టమే త‌న‌కు, త‌న భార్య‌కు కావాల‌ని.. అందుకోసం ఏం చేయ‌డానికైనా తాము సిద్ధ‌మ‌ని రాకేష్ తెలిపారు.
    Published by:Manjula S
    First published: