ఆస‌క్తి పుట్టిస్తున్న ‘సెవెన్’.. ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు..

జీనియ‌స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన హీరో హ‌వీష్. ఆ త‌ర్వాత కూడా రెండు సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఈ హీరో న‌టించిన సినిమా సెవెన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2019, 4:23 PM IST
ఆస‌క్తి పుట్టిస్తున్న ‘సెవెన్’.. ఒకే సినిమాలో ఏడుగురు హీరోయిన్లు..
సెవెన్ మూవీ పోస్టర్
  • Share this:
జీనియ‌స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన హీరో హ‌వీష్. ఆ త‌ర్వాత కూడా రెండు సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఈ హీరో న‌టించిన సినిమా సెవెన్. ఈ చిత్రం మొద‌లు పెట్టిన‌పుడు ఎవ‌రికీ పెద్ద‌గా అంచనాలు లేవు కానీ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత మాత్రం కొద్దో గొప్పో ఆస‌క్తి పుట్టించింది. ఇక టీజ‌ర్, ట్రైల‌ర్ వ‌చ్చిన త‌ర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ప్రేక్ష‌కులు. నిజార్ ష‌ఫీ తెర‌కెక్కించిన ఈ చిత్రం జూన్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. సినిమాపై న‌మ్మ‌కంతో ఒక్క‌రోజు ముందే ప్రీమియ‌ర్స్ కూడా ఏర్పాటు చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
Havish, Regina Cassandra starrer Seven movie paid premiers in Hyderabad one day before pk..  జీనియ‌స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన హీరో హ‌వీష్. ఆ త‌ర్వాత కూడా రెండు సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఈ హీరో న‌టించిన సినిమా సెవెన్. seven movie,seven telugu movie,regina cassandra,seven movie trailer,7 movie,7 movie trailer,seven movie teaser,7 telugu movie,regina new movie,regina,7 movie teaser,7 movie songs,regina movies,seven trailer,seven,7 telugu movie trailer,nandita swetha about seven movie,seven tamil movie trailer,havish movies,seven movie songs,seven tamil movie,seven movie tamil,seven movie review,7 tamil movie,seven teaser,telugu cinema,సెవెన్ మూవీ రివ్యూ,సెవెన్ మూవీ ప్రీమియర్స్,తెలుగు సినిమా,హవీష్ రెజీనా
సెవెన్ మూవీ పోస్టర్

జూన్ 5 సాయంత్ర‌మే ఈ చిత్ర ప్రీమియ‌ర్స్ భారీగా ప‌డుతున్నాయి. హ‌వీష్ ఈ సినిమాలో విభిన్న‌మైన పాత్ర‌లో న‌టించాడు. సీనియ‌ర్ న‌టుడు రెహ‌మాన్ ఇందులో కీల‌క పాత్రలో క‌నిపించాడు. రెజీనా, అనీషా ఆంబ్రోస్, అదితి ఆర్య లాంటి హీరోయిన్లు ఈ చిత్రంలో న‌టించారు. ర‌మేశ్ వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. అభిషేక్ పిక్చ‌ర్స్ కూడా స‌హ‌కారం అందించారు. మొత్తానికి ఈ చిత్రంతో క‌చ్చితంగా స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాన‌ని ధీమాగా చెబుతున్నాడు హ‌వీష్. మ‌రి ఆయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌రకు నిల‌బ‌డుతుందో చూడాలిక‌.
First published: June 5, 2019, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading