Home /News /movies /

HAVE SBSB PRODUCERS GONE OVERBOARD BANKING TOO MUCH ON SAI TEJ MHN

Sai Tej - Solo Brathuke So Better: సాయితేజ్ కి అంత సీన్ ఉందా?..SBSB సినిమా నిర్మాతలది మరీ అత్యాశేనా?

Have SBSB producers gone overboard banking too much on Sai Tej

Have SBSB producers gone overboard banking too much on Sai Tej

Sai Tej - Solo Brathuke So Better: ‘సోలో బ్రతుకే సో బెటర్’ హక్కులు దక్కించుకున్న జీ స్టూడియో సినిమాను ఇప్పుడు జీ ఫ్లెక్స్ లో రిలీజ్ చేసి షాకింగ్‌గా టిక్కెట్ ధరను నిర్ణయించింది. ఇంతకీ ఆ టిక్కెట్ ధర ఎంతో తెలుసా?

    సాయితేజ్ హీరోగా చేసిన ‘సోలో బ్ర‌తుకే సోబెట‌ర్’ సినిమా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఈ సినిమాను ప్రేక్ష‌కులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. నిజానికి నిర్మాత‌లు థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయో లేదోన‌ని సినిమాను జీ స్టూడియో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేసుకోవ‌డానికి ఓకే చెప్పేసి హ‌క్కుల‌ను ఇచ్చేశారు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు రూ.38కోట్ల‌కు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా హక్కులను అమ్మేశారు. అయితే చివరి నిమిషంలో థియేటర్స్ ఓపెన్ కావడంతో జీస్టూడియో వారే సినిమాను డైరెక్ట్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసుకున్నారు. సినిమాకు థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా దాదాపు తొమ్మి కోట్ల రూపాయ‌లు వ‌చ్చింది. అంటే సినిమాకు మ‌రో 29 కోట్లు రావాల్సిన అవ‌స‌రం ఉంది.

    దీంతో జీ స్టూడియోవారు ఓ ప్లాన్ చేశారు. సినిమాను జీ ఫ్లెక్స్‌లో పే ఫ‌ర్ వ్యూ లెక్క‌లో విడుద‌ల చేస్తున్నారు. తొలివారంలో సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు అందుకోసం రూ.149 రూపాయ‌ల‌ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఐ మ్యాక్స్ టిక్కెట్ ధ‌ర‌ను చెల్లించాల‌న్న‌మాట‌. నిజానికి ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ కోసం టిక్కెట్‌ను యాబై రూపాయ‌ల నుండి వంద రూపాయ‌ల‌కు పెంచారు. టిక్కెట్ రేట్ ఎందుకు పెంచారంటూ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిలాంటోడు ఈ సినిమా ఫంక్ష‌న్‌లోనే ఇన్ డైరెక్ట్‌గా విమ‌ర్శించాడు.

    ఇప్పుడు జీస్టూడియోవారు పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో టిక్కెట్‌పై రూ.149 వ‌సూలు చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో ఆలోచించాలి. కొంద‌రేమో ఇంత మొత్తంలో పే ఫ‌ర్ వ్యూ వ‌సూలు చేయ‌డ‌మేంటి? ఇది నిజంగా ఆత్యాశేన‌ని అంటున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పే ఫ‌ర్ వ్యూ లెక్క‌లో అంత మొత్తాన్ని రాబ‌ట్టుకుంటామా? అని జీస్టూడియోస్ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌. మ‌రి సాయితేజ్ సినిమాకు పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఆద‌ర‌ణ ద‌క్కితే క‌చ్చితంగా సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాకు తిరుగుండ‌దు.
    Published by:Anil
    First published:

    Tags: Nabha Natesh, Sai teja, Solo Brathuke So Better

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు