HOME»NEWS»MOVIE»has rx100 fame payal rajput fell in love here are the details ta
పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో ఉందా... ఆ పోస్ట్‌కు అర్ధం ఏంటో ..
పాయల్ రాజ్‌పుత్ (Instagram Photo)
‘RX 100’ చిత్రం తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘RX 100’ చిత్రం తన బోల్డ్ నటనతో కుర్రహృదయాలను బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడికి సంబంధించి ఏ అబ్డేట్ అయినా తెలుసుకోడానికి యూత్ తెగ ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తోన్న ‘వెంకీ మామ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.ఎపుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే ఈ భామ ఇటీవల తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతా లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో పాయల్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. వివరాలలోకి వెళితే .. ఈ మధ్య కాలం లో పాయల్ ప్రేమలో పడింది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి . అయితే ఇటీవల పాయల్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో పాయల్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఇక పాయల్‌తో ఉన్న వ్యక్తి ఎవరా అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలైయ్యాయి.
దాంతో నెటిజన్లు ఆమె ప్రియుడై ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు.అదీకాకుండా కామెంట్స్ ఎక్కువగా కనిపించకుండా పాయల్ కొన్ని బ్లాక్ చేసేశారు. దీంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఇక ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో పాయల్ చెప్తే కానీ ఆడియన్స్‌కు క్లారిటీ వచ్చేలా లేదు.అయితే ఈ పిక్ ను చూసిన పాయల్ అభిమానులు మాత్రం ప్రియుడని చెప్పి మా హృదయాలను గాయపరచకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలా యువ హృదయాలను కొల్లగొడుతున్న బ్యూటీ .. ఈ కామెంట్స్ స్పందించాల్సి ఉంది.