దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందున్న మెజారిటినీ క్రాస్ చేసి రాజకీయ విశ్లేషలకు సైతం ఔరా అనిపించాడు. అంతేకాదు వరుసగా రెండోసారి పూర్తిస్థాయి ఆధిత్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర నేతగా నరేంద్ర మోదీ రికార్డులకు ఎక్కాడు. ఇక ఒక ఛాయి వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగారు. ఇపుడు రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆయన జీవితంపై వివేక్ ఓబరాయ్ ప్రధాన పాత్రలో ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ తెరకెక్కింది. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నికల కోడో కారణంగా వాయిదా పడి..ఈ నెల 24న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత విడుదలైంది. హిందీతో పాటు తెలుగు సహా దేశంలోని 23 భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజున రూ.2.88 కోట్లు వసూలు చేసింది. ఐతే ఈ సినిమాను ప్రధానమంత్రి చూసారా ? లేదా అనే ప్రశ్న అందరిలో ఉండిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా కొంత మంది విలేఖరులు వివేక్‌ను అడిగారు.
ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోదీ గారికి ఎన్నో పనులున్నాయి. అంతేకాదు ఆయనకు సమయం దొరికినపుడు ఖచ్చితంగా చిత్ర బృందాన్ని పిలుస్తారన్నారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తన్నారు. ఆ తర్వాత సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందని అడగగా..ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ సినిమాను చూసి నాకు సందేశాలు పంపిస్తున్నారు. దుబాయి, ఆస్ట్రేలియా,లండన్‌కు చెందిన ప్రవాస భారతీయులు థియేటర్స్‌లో మోదీ..మోదీ..భారత్ మాతా కీ జై అంటూ కేకలు పెడుతున్నారు. నేను అచ్చం మోదీలా నటించానని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు తెరపై నేను కాకుండా మోదీనే కనిపించారని ప్రశంసల జల్లు కురిపించడం చూస్తుంటే.. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేసాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Lok sabha election results, Lok Sabha Elections 2019, Narendra modi, Pm modi, PM Narendra Modi Biopic