Home /News /movies /

HARRIS JAYARAJ TO COMPOSE MUSIC FOR NITHIN VAKKANTHAM VAMSI NEXT HERE ARE THE DETAILS SR

Nithiin : నితిన్ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం.. అందోళనలో అభిమానులు..

Nithiin Photo : Twitter

Nithiin Photo : Twitter

Nithiin : యూత్ స్టార్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది.

    యూత్ స్టార్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చింది. నితిన్ సినిమాకు సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ జైరాజ్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. హరీష్ జైరాజ్ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చివరగా తెలుగులో మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఆ తర్వాత ఇన్నాళ్లకు నితిన్ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని హరీష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే.. హరీష్ సమకూర్చిన ఏ తెలుగు సినిమా పెద్దగా అలరించలేదు. పాటలు మాత్రం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. చూడాలి మరి నితిన్ సినిమా ఎలా ఉండనుందో.. అయితే ఈ విషయంలో నితిన్ అభిమానులు కొంత అందోళన చెందుతున్నారట.

    ఇక నితిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (macherla niyojakavargam movie) అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29, 2022న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఎన్నికల ఆఫీసర్‌గా నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నితిన్ సరసన హీరోయిన్ చేస్తున్నారు. ఇక తాజాగా వస్తోన్నసమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనుందని టాక్.


    ఈ చిత్రాన్ని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నితిన్ హిందీ చిత్రం అంధాదున్ రీమేక్‌ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ తెలుగు సినిమాకు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించింది. నితిన్ సరసన నభా నటేష్ (Nabha Natesh) నటించారు.

    ఇక ఒరిజినల్‌ అంధధున్‌‌లో టబు చేసిన పాత్రలో తమన్నా (Tamannah) నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nithiin, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు