Sunil Harish Shankar: హీరోగా సినిమాలు మానేసి హాయిగా కమెడియన్ కమ్ విలన్‌గా కంటిన్యూ అవుతున్నాడు సునీల్. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలు ఏవీ విజయం సాధించలేదు.
హీరోగా సినిమాలు మానేసి హాయిగా కమెడియన్ కమ్ విలన్‌గా కంటిన్యూ అవుతున్నాడు సునీల్. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలు ఏవీ విజయం సాధించలేదు. అందుకే అప్పుడెప్పుడో వచ్చిన 2 కంట్రీస్ తర్వాత హీరోగా సినిమాలు చేయడమే మానేసాడు సునీల్. హాయిగా కామెడీ రోల్స్ చేసుకుంటున్నాడు. ఆ మధ్య డిస్కో రాజాలో విలన్‌గా చేసాడు.. ఇప్పుడు కలర్ ఫోటోలో కూడా విలన్ అయ్యాడు. ఇలాంటి సమయంలో మళ్లీ హీరోగా నటించబోతున్నాడు సునీల్. ఈయన మెయిన్ లీడ్‌గా వేదాంతం రాఘవయ్య అనే సినిమా రాబోతుంది.
దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దీనికి కథ అందిస్తున్నాడు. గతేడాది గద్దలకొండ గణేష్ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ గ్యాప్‌లోనే సునీల్ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నాడు. దాంతో పాటు సమర్పకుడిగా కూడా మారిపోయాడు. వేదాంతం రాఘవయ్య అంటే ఒకప్పటి సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.
నటుడు సునీల్ (actor Sunil)
దేవదాస్ లాంటి కళాఖండాన్ని తీసిన దర్శఖుడు. అలాంటి ప్రముఖుడి పేరుతో ఈ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. దీనికి ఆయన శిష్యుల్లో ఒకరు దర్శకుడిగా మారుతున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపైనే హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా చేసాడు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్లో సునీల్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా సునీల్ మళ్లీ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.