ఇప్పుడే మొదలైంది అంటున్న పవన్ కళ్యాణ్.. రాస్కోరా సాంబ..

Pawan Kalyan Harish Shankar: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందిరో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 18, 2020, 2:20 PM IST
ఇప్పుడే మొదలైంది అంటున్న పవన్ కళ్యాణ్.. రాస్కోరా సాంబ..
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ (Twitter/Pawan Kalyan Harish Shankar)
  • Share this:
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందిరో అంటూ సోషల్ మీడియాలో కూడా రచ్చ చేసారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ముందు పవన్ ఒప్పుకున్న క్రిష్, పింక్ రీమేక్ వకీల్ సాబ్ పూర్తైన తర్వాత హరీష్ సినిమా మొదలు కానుంది. గబ్బర్ సింగ్ వచ్చి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మద్యే సోషల్ మీడియాలో ఓ లేఖ రాసాడు హరీష్ శంకర్. ఇది చదివిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )


కచ్చితంగా ఈ సారి కూడా బ్లాక్‌బస్టర్ కొడతామని ధీమాగా చెప్పాడు ఈ దర్శకుడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు క్రేజీ టైటిల్ ఒకటి అనుకుంటున్నారు. ఇప్పుడే మొదలైంది అంటూ చిత్రమైన టైటిల్ దీనికి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్‌లో అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ సరసన మానస రాధాకృష్ణన్ (Twitter/Pawan kalyan Manasa Ramakrishnan)
పవన్ కళ్యాణ్ సరసన మానస రాధాకృష్ణన్ (Twitter/Pawan kalyan Manasa Ramakrishnan)


ఇప్పుడు తమ కాంబినేషన్‌లో రానున్న రెండో సినిమాకు ఇదే టైటిల్ రిజిష్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా దీనికి సై అనేసారు. మొన్న హరీష్ శంకర్ రాసిన లెటర్‌లో కూడా ఇప్పుడే మొదలైంది అనేది హైలైట్ చేసాడు. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. జనవరిలో మొదలు పెట్టి 2021 మధ్యలో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 18, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading