జీవితంలో ఎవర్నీ మరిచిపోయినా కూడా మనం ఎదగడానికి సాయం చేసిన వాళ్లను మాత్రం అస్సలు మరిచిపోకూడదు. అలా చేస్తే మనకంటే చెడ్డ వాళ్లు ఎక్కడా ఉండరు. ఈ విషయంలో హరీష్ శంకర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తన కెరీర్‌కు సాయం చేసిన వాళ్లను అందర్నీ గుర్తించుకున్నాడు ఈ దర్శకుడు. పన్నెండేళ్ల కింద ‘షాక్’ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరీష్. వర్మ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించాడు. ఆయన ఇమేజ్ పీక్స్‌లో చేసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.
Once again I wanna say my whole hearted life time thanks to.....
Mass Maharaaj @RaviTeja_offl for giving Mirapakaay
Your trust made me to stand here today thanks is not enough Annayya ...
Love you so much ...#8years of Mirapakaay 🙏🙏 pic.twitter.com/edjsulHmFy
— Harish Shankar .S (@harish2you) January 13, 2019
దాంతో ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండి 2011లో ‘మిరపకాయ్’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చాడు హరీష్ శంకర్. ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సరిగ్గా ఏడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంక్రాంతికి ‘పరమవీరచక్ర’ సినిమాను ఓడించి మరీ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులో మాట బయటపెట్టాడు హరీష్ శంకర్. రవితేజ లేకపోతే నేను లేను అంటున్నాడు ఈ దర్శకుడు.
My special thanks to @MusicThaman for giving my first block buster album ... Never ever can forget those priceless Chennai nights while making Mirakapakaay music .... Thank you so much Bawa ... Can't wait to work with you ... 🤗🤗🤗 pic.twitter.com/x96W5PcURI
— Harish Shankar .S (@harish2you) January 13, 2019
నిజమే అప్పటికి ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్‌ను నమ్మి రవితేజ ‘మిరపకాయ్’ సినిమా చేయడం.. అది హిట్టవ్వడం.. వెంటనే ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ పన్నెండేళ్ల కల తీర్చేయడం.. స్టార్ డైరెక్టర్ అయిపోవడం అన్నీ వెంటవెంటనే జరిగాయి. ‘రామయ్య వస్తావయ్యా’ ఫ్లాప్ అయినా కూడా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘డిజే’ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు హరీష్. ప్రస్తుతం కొత్త సినిమా కోసం కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి తన కెరీర్‌కు ఇంత సాయం చేసిన రవితేజను మాత్రం జీవితంలో మరిచిపోలేనంటున్నాడు హరీష్ శంకర్.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Raviteja, Telugu Cinema, Tollywood