ఆర్జీవి బాటలో హరీష్ శంకర్.. ఆ పార్టీ అధినేతపై హరీష్ సంచలన వ్యాఖ్యలు..

గురువు రామ్ గోపాల్ వర్మ బాటలో దర్శకుడు హరీష్ శంకర్ రాజకీయాలపై మాట్లాడుతున్నాడు.

news18-telugu
Updated: November 23, 2019, 2:49 PM IST
ఆర్జీవి బాటలో హరీష్ శంకర్..  ఆ పార్టీ అధినేతపై హరీష్ సంచలన వ్యాఖ్యలు..
రామ్ గోపాల్ వర్మ,హరీష్ శంకర్ (Facebook/Photo)
  • Share this:
గురువు రామ్ గోపాల్ వర్మ బాటలో దర్శకుడు హరీష్ శంకర్ రాజకీయాలపై మాట్లాడుతున్నాడు. ఇక వర్మ విషయానికొస్తే.. తనకు అంతగా గిట్టని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై తన లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో  తనదైన శైలిలో వంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన శిష్యుడు హరీష్ శంకర్ కూడా గురువు రామ్ గోపాల్ వర్మ బాటలో తాజాగా మహారాష్ట్రలో జరిగిన రాజకీయా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. తాజాగా మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై జరిగిన పేచితో వీళ్లిద్దరు తమ మధ్య వున్నరాజకీయ బంధానికి వీడ్కొలు పలికారు. రాష్ట్రపతి పాలన తర్వాత శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సహాయం కోరాడు. ఈ ముగ్గురి మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం కింద కొన్ని షరతులు విధించుకున్నారు.

maharashtra politics,maharashtra,maharashtra cm,maharashtra government,maharashtra politics news,maharashtra election,maharashtra election 219,maharashtra cm 2019,maharashtra assembly elections,maharashtra political crisis,politics,maharashtra assembly election 2019,maharashtra polls,maharashtra elections,shiv sena,maharashtra bjp,maharashtra tussle,maharashtra news,maharashtra assembly polls,maharashtra elections 2019 telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, మహారాష్ట్ర, శివసేన,
శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫడ్నవీస్


ఇక ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి.. వెంటనే మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ విషయమై శరద్ పవార్.. తనకు తెలియకుండానే అజిత్ పవార్ తన పార్టీని చీల్చాడంటూ ఆయనను పార్టీ శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలిగించారు. ఈ విషయమై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 1978లో పవార్ కాంగ్రెస్ తరుపున గెలచి.. మర్నాడే పార్టీని చీల్చి  ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెలకొల్పి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసారు. సరిగ్గా ఆయనకే ఈ  పాఠం ఎదురవడం విశేషం. తాజాగా అజిత్ పవార్ వెంట 30 మంది ఎన్సీపీ శాసనసభ్యులు ఉన్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 23, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading