దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ సినిమా అవ్వడానికి హిందీ రీమేక్ అయినా దానికి హరీష్ తనదైన మార్పులతో తెలుగు నేటీవిటికి తగ్గట్లు రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. గబ్బర్ సింగ్ ఒరిజినల్ కి దూరంగా పవన్ ఇమేజ్ కి సరిపోయేలా హరీష్ తెరకెక్కించిన విధానం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా విడుదలై దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. హరీష్ తాజాగా గద్దలకొండ గణేష్ అంటూ మరో తమిళ రీమేక్ వరుణ్ తేజ్‌తో చేసి మరోసారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన మరోసారి పవన్‌తో కలిసి ఓ సినిమాకు పనిచేయనున్నాడు. పవన్ ప్రస్తుతం తన 26వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత పవన్ తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ తో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంచెం సమయం ఉంది. దీంతో హరీష్ శంకర్, మహేష్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ఈ మధ్య చెప్పాడు. ఓ పక్క పవన్ సినిమా పనులు చూసుకుంటూనే ఆయన మహేష్ ని దృష్టిలో పెట్టుకొని మంచి కమర్షియల్ స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇంకే సినిమాను ప్రకటించలేదు. అయితే గీత గోవిందంతో హిట్ అందించిన పరశురామ్‌తో దాదాపు ఓ సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. బహుశా ఆ సినిమా తర్వాత హరీష్‌తో మహేష్ కలిసి ఓ సినిమా ఉండోచ్చు. మహేష్ , హరీష్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ పంథాలో సాగుతుందని సమాచారం. మరో విషయం ఏమంటే రాజమౌళి తదుపరి సినిమా కూడా మహేష్‌తో ఉండనుంది. అయితే అది బహుశా హరీష్ సినిమా తర్వాత ఉండోచ్చని సమాచారం.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.