హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీపై హరీష్ శంకర్ కాంట్రవర్సీ ట్వీట్..

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీపై హరీష్ శంకర్ కాంట్రవర్సీ ట్వీట్..

అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కమిట్ అయిన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ సాయంత్రం 4.05 నిమిషాలకు రాబోతుంది. ఇలా ఒకేరోజు మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానులు సంతోషలో మునిగిపోయారు.

అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కమిట్ అయిన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ సాయంత్రం 4.05 నిమిషాలకు రాబోతుంది. ఇలా ఒకేరోజు మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానులు సంతోషలో మునిగిపోయారు.

దర్శకుడు హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక అభిమానం. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్‌కు మంచి సక్సెస్ అందించాడు. నిన్నటితో ఈ సినిమా 8 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ .. చేసిన ట్వీట్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

ఇంకా చదవండి ...

దర్శకుడు హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక అభిమానం. ఎందుకంటే.. పదేళ్లుగా సరైన సక్సెస్ లేని పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా వచ్చినట్టే వచ్చి బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్.. అన్ని రకాల సినిమాలు ట్రై చేసినా.. ఏది వర్కౌట్ కానీ టైమ్‌లో అసలసిసలైన హిట్ అందించాడు హరీష్ శంకర్. ఈ సినిమా నిన్నటితో 8 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు  ‘గబ్బర్ సింగ్’ 8 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్‌తో కాస్త ఎక్కువగానే హంగామా చేసారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ .. ఈ చిత్రంతో తనకున్న జ్ఞాపకాలను తెలియజేస్తూ ఓ లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ లెటర్‌తోనే ఆయన కొత్త కాంట్రవర్సీకి శ్రీకారం చుట్టాడు. అవును.. ఈ లెటర్‌లో అందరి పేర్లు ఉన్నాయి కానీ.. పవన్ కల్యాణ్‌ని దేవుడిలా కొలిచే, ‘గబ్బర్‌సింగ్’ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో హరీష్ శంకర్ మరోసారి వివాదానికి తెరలేపినట్లయింది. ఓ చిత్రానికి దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయితే.. నిర్మాత ఓనర్ ఆఫ్ ది షిప్ అనే చెప్పాలి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఎంతగానో అభిమానించే దర్శకుడు హరీష్ శంకర్.. ఆయన్ని ఓ దైవంగా కొలిచే నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కితే.. ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించిన బండ్ల గణేష్ అభిమానులతో గబ్బర్ సింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతేకాదు చాలా రోజుల తర్వాత గబ్బర్ సింగ్ పుణ్యామా అంటూ సోషల్ మీడియాలో కాస్తంత హడావుడి చేసాడు బండ్ల గణేష్.  కానీ తాజాగా హరీష్ శంకర్ విడుదల చేసిన లెటర్‌లో నిర్మాత బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా ? అనే డౌట్స్ అభిమానులకు వస్తున్నాయి. మరోవైపు హరీష్ శంకర్.. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్‌తో ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శృతి హాసన్ పేరును లెటర్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.

First published:

Tags: Bandla Ganesh, Harish Shankar, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు