HariKrishna Nandamuri: అందుకే నందమూరి హరికృష్ణ సాహసరత్న అయ్యారు.. అందుకు ఋజువు ఇదిగో..

హరికృష్ణ (File/Photo)

HariKrishna Birth Anniversary | ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలి.. చావుకు మనం భయపడ కూడదు చావే మనలను చూసి భయపడాలి’ ఈ డైలాగ్ విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి నందమూరి హరికృష్ణ. తాజాగా ఓ షూటింగ్ సమయంలో చేసిన పనిని చూసి అందరు భయపడిపోయారట.

  • Share this:
    HariKrishna Nandamuri Birth Anniversary |  ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలి.. చావుకు మనం భయపడ కూడదు చావే మనలను చూసి భయపడాలి’ ఈ డైలాగ్ విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna). వెoడి తెర మీద హీరోలు చాలా మంది ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా  అసలైన హీరో అనిపించుకున్నారు నందమూరి హరికృష్ణ. ఈయన చాల డైనమిక్ అండ్ పవర్ఫుల్ పర్సనాలిటీ. అంతేకాదు చాలా సున్నిత మనస్కుడు. ఈ డైలాగ్‌కి తగ్గట్టే నిజ జీవితంలో కూడా హరికృష్ణ చాలా డేరింగ్ అండ్ డాషింగ్.  దీనికో ఉదాహరణ  ఆయన నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ఓ సన్నివేశం. ఈ సీన్‌ను ప్రాణాలకు తెగించి మరీ చేశారు హరికృష్ణ.

    ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ప్రత్యర్థి జయప్రకాష్ రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా రైల్వే ట్రాక్‌ను క్రాస్ చేసే క్రమంలో వారిని ఆగమని లైట్లు వేసినా ముందుకు వచ్చేస్తారు జయప్రకాశ్ రెడ్డి. దీనితో రెండు కార్లు రైల్వే ట్రాక్ పైన ఆగిపోతాయి.  ఒక వైపు నుంచి రైలు వస్తుంటుంది, రైలు దగ్గరగా రావటంతో భయపడిన జయప్రకాశ్ రెడ్డి కారు వెనకకు తీసుకుంటారు, వెంటనే కారు స్టార్ట్ చేయటానికి ప్రయత్నించిన హరికృష్ణ కారు స్టార్ట్ అవలేదు. షూట్ చేస్తున్న యూనిట్ మొత్తం భయపడి పోయారట.

    Harikrishna Birth Anniversary : నందమూరి హరికృష్ణ సినీ, రాజకీయ ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలు..

    కానీ హరికృష్ణ మాత్రం ఎటువంటి కంగారు లేకుండా రెండవసారి, మూడవసారి ప్రయత్నించి కారు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్లిపోయారు.  క్షణాలలో రైలు బండి ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశం షూట్ చేసేటపుడు యూనిట్ మొత్తానికి  ముచ్చెమటలు పట్టాయట. కానీ ఆ తర్వాత హరికృష్ణ నిజంగానే చేసిన ఈ సాహాసాన్ని అందరు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

    Balakrishna - HariKrishna : అన్న హరికృష్ణ జయంతి సందర్భంగా బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్..


    ఇది హరికృష జీవితంలో ఆయన తెగింపుకు ఒక ఉదాహరణ మాత్రమే. స్వతహాగా హరికృష్ణ మంచి డ్రైవర్‌. అప్పట్లో అన్నగారి చైతన్య రథాన్ని ఆయనే స్వయంగా నడిపించిన సంగతి తెలిసిందే కదా.తొలినాళ్లలో నటుడిగా తనదైన ముద్రవేసిన హరికృష్ణ.. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే నడిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఈ నేపథ్యంలో పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘శ్రీరాములయ్య’తో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అందులో ‘సత్యం’ పాత్ర చేయడానికి చిత్ర పరిశ్రమలోని వారందరూ భయపడుతుంటే ధైర్యంగా ఆ పాత్ర చేసి మెప్పించారు హరికృష్ణ. ఆ తర్వాత సీతయ్యగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరికృష్ణ. ఈయన 2018 ఆగష్టు 29న ఆయన నడిపిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురై కన్నుమూసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: