హోమ్ /వార్తలు /సినిమా /

HariKrishna: నిజ జీవితంలో కూడా హరికృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ.. అందుకు ఋజువు ఇదిగో..

HariKrishna: నిజ జీవితంలో కూడా హరికృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ.. అందుకు ఋజువు ఇదిగో..

HariKrishna Birth Anniversary | ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలి.. చావుకు మనం భయపడ కూడదు చావే మనలను చూసి భయపడాలి’ ఈ డైలాగ్ విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి నందమూరి హరికృష్ణ. తాజాగా ఓ షూటింగ్ సమయంలో చేసిన పనిని చూసి అందరు భయపడిపోయారు.

ఇంకా చదవండి ...

    ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలి.. చావుకు మనం భయపడ కూడదు చావే మనలను చూసి భయపడాలి’ ఈ డైలాగ్ విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి నందమూరి హరికృష్ణ. వెoడి తెర మీద హీరోలు చాలా మంది ఉంటారు కానీ నిజ జీవితం లో కూడా హీరో నందమూరి హరికృష్ణ చాల డైనమిక్ అండ్ పవర్ఫుల్ పర్సనాలిటీ. అంతేకాదు చాలా సున్నిత మనస్కుడు. ఈ డైలాగ్ కి తగ్గితే నిజజీవితంలో కూడా హరికృష్ణ చాలా డేరింగ్ అండ్ డాషింగ్. దీనికి తగ్గితే ఆయన నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ఓ సన్నివేశాన్ని ప్రాణాలకు తెగించి మరీ చేశారు హరికృష్ణ. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ప్రత్యర్థి జయప్రకాష్ రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా రైల్వే ట్రాక్ ను క్రాస్ చేసే క్రమంలో వారిని ఆగమని లైట్లు వేసిన ముందుకు వచ్చేస్తాడు జయప్రకాశ్ రెడ్డి. దీనితో రెండు కార్లు రైల్వే ట్రాక్ పైన ఆగిపోతాయి.  ఒక వైపు నుంచి రైలు వస్తుంటుంది, రైలు దగ్గరగా రావటంతో భయపడిన జయప్రకాశ్ రెడ్డి కారు వెనకకు తీసుకుంటారు, వెంటనే కారు స్టార్ట్ చేయటానికి ప్రయత్నించిన హరికృష్ణ కారు స్టార్ట్ అవలేదు. షూట్ చేస్తున్న యూనిట్ మొత్తం భయపడి పోయారు.  కానీ హరికృష్ణ మాత్రం ఎటువంటి కంగారు లేకుండా రెండవసారి, మూడవసారి ప్రయత్నించి కారు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్లిపోయారు.  క్షణాలలో రైలు బండి ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశం షూట్ చేసేటపుడు యూనిట్ మొత్తానికి  ముచ్చెమటలు పట్టాయి. కానీ ఆ తర్వాత హరికృష్ణ నిజంగానే చేసిన సాహాసాన్ని అభినందించారు.  ఇది హరికృష జీవితంలో ఆయన తెగింపుకు ఒక ఉదాహరణ మాత్రమే. స్వతహాగా మంచి డ్రైవర్‌ హరికృష్ణ. అప్పట్లో అన్నగారి చైతన్య రథాన్ని ఆయన్నే స్వయంగా నడిపించిన ట్రాక్ రికార్డ్ హరికృష్ణ సొంతం.  తొలినాళ్లలో నటుడిగా తనదైన ముద్రవేసిన హరికృష్ణ.. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే నడిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘శ్రీరాములయ్య’తో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అందులో ‘సత్యం’ పాత్ర చేయడానికి చిత్ర పరిశ్రమలోని వారందరూ భయపడుతుంటే ధైర్యంగా ఆ పాత్ర చేసి మెప్పించారు హరికృష్ణ. ఆ తర్వాత సీతయ్యగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరికృష్ణ.

    First published:

    Tags: Harikrishna, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు