harika narayan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో మెగా హీరో రామ్ చరణ్, పూజా హెగ్డే నటిస్తున్నారు. నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 13న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలోని పాటలు విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లాహే.. లాహే పాట ఎంత ఆకట్టుకుందో చెప్పలేం. ఎందుకంటే ఈ పాట విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకుంది.
మరి ఇంత మంచి పాటను అందించిన సింగర్స్ ఎవరో కాదు.. ఎన్నో సినిమాలలో తమ పాటలను వినిపించినా.. సింగర్స్ హారిక నారాయణ్, సాహితి చాగంటి. అసలు ఈ పాటను వీరిద్దరికి తెలియకుండానే అనుకోకుండా రికార్డు చేశారట. అసలు ఈ పాట ఈ సినిమాకు అన్ని వీరిద్దరికి తెలియదట. ఆచార్య సినిమా కోసమని ఈ పాట పాడుతున్నామని.. ఈ పాట సగం పూర్తయ్యేవరకు వారికి తెలియదట. ఇక అప్పుడు తెలిసాక షాక్ అయ్యారట. కానీ మొత్తానికి ఈ పాట మాత్రం బాగా ఆకట్టుకోగా.. ఎక్కువ హారిక నారాయణ్ వాయిస్ నచ్చిందంటు నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే హారిక నారాయణ్ ఎన్నో సినిమాలలో పాడగా.. తన పాటలు తనకు మంచి విజయాన్ని అందించాయి. ఇదివరకే ఆమె కొన్ని పాటల షోలలో పాడగా.. ఓ షో లో ఈమె పాడిన పాట విన్నా ఓ డైరెక్టర్ తనకి తన సినిమాలో పాడటానికి అవకాశం ఇచ్చాడట. దీంతో ఆమె ఎన్నో సినిమాలలో తన స్వరాన్ని వినిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya movie, Harika narayan, Lahe lahe song, Megastar Chiranjeevi, Singer sahiti