విజయ్ దేవరకొండ ఓ క్రేజీ స్టార్..ఇంత తక్కువ సమయంలో అంత పాపులారిటీ..ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోకు రాలేదని చెప్పోచ్చు. దేవరకొండ నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అర్జున్ రెడ్డి సినిమా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.. దీంతో విజయ్ దేవరకొండ సినిమాలంటేనే యూత్‌లో ఏదో తెలియని క్రేజ్. అది అలా వుంటే.. రష్మిక, విజయ్ బ్లాక్ బస్టర్ సినిమా 'గీతగోవిందం'లో ఈ ఇద్దరి కెమీస్ట్రీ అదిరిపోయిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ ఇద్దరి యాక్టింగ్, రొమాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాలో రష్మిక విజయ్ లిప్ లాక్ సీన్స్ పై నటి హరిప్రియ కామెంట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. హరిప్రియ ప్రస్తుతం ‘ఎల్లిదే ఇల్లితనకా’ అనే కన్నడ చిత్రం చేశారు. ఈ సినిమా శుక్రవారం (ఈరోజు )ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాలో హీరో సృజన్ లోకేశ్, హరిప్రయకు మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని షూట్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో కిస్ సీన్‌ను తెలుగు సినిమా ‘గీత గోవిందం’లోని కిస్ సీన్‌తో పోల్చుతున్నారు అక్కడి ప్రేక్షకులు. దీంతో ఈ విషయంపై హరిప్రియ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య అధర చుంబనం ఉండగా.. నేను నటించిన ఈ ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో ఉన్నది కేవలం మామూలు ముద్దు సీన్ మాత్రమే..’ అని తెలిపింది హరిప్రియ.
అంతేకాదు ఆమె ఇంకా మాట్లాడుతూ.. నీను నటించే సినిమాలు నా ఫ్యాన్స్, ఫ్యామిలీ తో కలిసి చూసేలా జాగ్రత్త పడుతాను.. అది నా బాధ్యతగా ఫీల్ అవుతానంటోంది. అయితే కథ డిమాండ్ చేయబట్టే ఈ సినిమాలో ఆ ముద్దు సీన్‌లో నటించానని అంటోంది ఈ ముద్దుగుమ్మ. హరిప్రియ తెలుగులో ‘తకిట తకిట’, నాని హీరోగా వచ్చిన ‘పిల్ల జమిందార్’, బాలయ్య సరసన ‘జైసింహా’లో నటించి తన అంద చందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.