హోమ్ /వార్తలు /సినిమా /

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో బాబీ డియోల్..

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో బాబీ డియోల్..

హరి హర వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అయిన బాబీ డియోల్ (Twitter/Photo)

హరి హర వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అయిన బాబీ డియోల్ (Twitter/Photo)

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన చేసే సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై పడింది. ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డేట్స్‌ను పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత క్రిష్.. వైష్ణవ్ తేజ్‌తో ‘కొండపొలం’ సినిమా కూడా పూర్తి చేసాడు. అటు  హాట్ స్టార్ కోసం ‘9 Hours అనే వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసాడు. ఇక రాజకీయాల్లో పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. త్వరలోనే మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు.

పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా ఇది తెలుస్తుంది. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగష్టు మొదటి వారంలో మొదలు పెట్టనున్నారు. మరోవైపు నవంబర్ వరకు ఫస్ట్ వీక్ వరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ఈ డేట్స్ లోపలనే పవన్ కళ్యాణ్ పోర్షన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తారట. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో బాబీ డియోల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు.  ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak) విషయానికి వస్తే... ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై  మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను మార్చి 31న విడుదల కానుంది.

First published:

Tags: Bobby Deol, Hari Hara Veera Mallu, Krish, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు