#HBD:విలక్షణ నటి ‘విద్యాబాలన్’ @40

news18-telugu
Updated: January 1, 2019, 11:48 AM IST
#HBD:విలక్షణ నటి ‘విద్యాబాలన్’ @40
విద్యా బాలన్ (ఫైట్ ఫోటోస్)
  • Share this:
బాలీవుడ్ హీరోయిన్స్ అంటే సైజ్ జీరోతో నిత్యం ఏదో వర్కౌట్స్ చేస్తూ హాట్ హాట్‌గా దర్శమిస్తారు. కానీ ఈ కథానాయిక మాత్రం అలా కాదు. పద్దతిగా కనిపిస్తూనే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్‌కు సైతం వెనకాడని హీరోయిన్. అంతేకాదు బాలీవుడ్‌లో ఎప్పటి కొత్త కహానీలతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోన్న పరిణీత.

అందరిలో ఒకరిలా కాకుండా బాలీవుడ్‌లో ఆమెకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆ కథానాయికే విద్యాబాలన్. సాధారణంగా పెళ్లైన తర్వాత చాలా మంది హీరోయిన్లు నటనకు స్వస్తి చెబుతారు. కానీ విద్యాబాలన్..పెళ్లైన తర్వాత కథానాయికగా తన సత్తా చాటుతోంది.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలకృష్ణ, విద్యాబాలన్


ప్రస్తుతం ఈ భామ..బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో మహానటుడు నందమూరి తారక రామారావు సతీమణి..బసవ తారకం పాత్రలో కనిపించనుంది.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ (ట్విట్టర్ ఫోటో)


మాములుగా విద్యా చేసే సినిమాలు కూడా ఎవరి అంచనాలకు అందవు. సాధారణంగా అందరూ అద్భుతమైన పిక్చర్స్ చేసి అవార్డ్స్ పొందుతారు. కాని, విద్యా బాలన్ మాత్రం  ‘డర్టీ పిక్చర్’ చేసి జాతీయ అవార్డును ఎగరేసుకుపోయింది.

అప్పటి ఉప రాష్ట్రపతి చేతులు మీదుగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న విద్యాబాలన్ (ఫీటీఐ)
అంతేకాదు ఆమె యాక్టింగ్ టాలెంట్‌కు మెచ్చి కేంద ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. ఆ తర్వాత ‘కహాని’, మూవీలో తప్పిపోయిన మొగుడిని వెతికే పాత్రలో ఆమె అభినయం ఎవరు మరిచిపోలేదు.

అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా జాతీయ అవార్డు అందుకున్న విద్యాబాలన్ (ఫస్ట్ పోస్ట్)


ఆ తర్వాత ‘బేగంజాన్’ సినిమాలో వేశ్యా వాటికను నిర్వహించే వేశ్య పాత్రలో నటించడం అనేకంటే జీవించిందనే చెప్పాలి. ఆ తర్వాత ‘తుమ్హారీ సులు’ మూవీలో రేడియో జాకీగా అలరించింది.

‘తుమ్హారీ సులు’లో విద్యాబాలన్


ఇపుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మహానటుడు అర్థాంగి బసవతారకం పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ (ట్విట్టర్ ఫోటో)


అంతేకాదు  త్వరలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తెరకెక్కనున్న బయోపిక్‌లో ఇందిరా గాంధీ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో  బాలయ్యతో  విద్యాబాలన్


మొత్తానికి ఇంటా బయటా విజయాలతో దూసుకుపోతున్న విద్యాబాలన్ ఇలాంటి పుట్టినరోజులను మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.


ఇది  కూడా చదవండి 

నూతన సంవత్సర వేళ బాలీవుడ్‌లో విషాదం.. విలక్షణ నటుడు ఖాదర్ ఖాన్ ఇక లేరు

2019లో విడుదల కాబోతున్న భారీ చిత్రాలు ఇవే..

#FlashBack2018:2018లో టాప్ 5 కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ సినిమాలు
Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2019, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading