#HBD: స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రహమాన్

భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లివింగ్ లెజెండ్. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించాడు. ఇండియాలో మ్యూజిక్ అంటే రెహమాన్ అనేలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జనవరి 6న ఈ స్వర మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..

news18-telugu
Updated: January 5, 2019, 11:03 PM IST
#HBD: స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రహమాన్
స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రహమాన్
  • Share this:
భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లివింగ్ లెజెండ్. ఇండియన్ మ్యూజిక్ ప్రపంచంలో సంచలనాలకు సెంటర్ పాయింట్. అతను కంపోజ్ చేసిన ప్రతి పాటా ప్రత్యేకమే. మనసును తాకే మధురమైన సంగీతాన్నే కాదు.. హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా కంపోజ్ చేసి చిందులేయించాడు. ఇండియాలో మ్యూజిక్ అంటే రెహమాన్ అనేలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జనవరి 6న ఈ స్వర మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..

సంగీతాన్నందించిన మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్. ఎప్పుడూ.. ఎవరూ వినని ప్రత్యేక శైలితో అలరించిన స్పెషలిస్ట్. చిన్నపుడు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోని ఈ స్థానానికి చేరుకున్నాడు. హృదయాల్ని కదిలించే బాణీలతో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)


మణిరత్నం ‘రోజా’ తో మొదలైన రెహమాన్ సంగీత ప్రవాహం.  ‘2.O’ వరకు కొనసాగుతూనే ఉంది.  దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా కొనసాగిన రహమాన్ సంగీత ప్రస్థానంలో.. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు.

ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)


కెరియర్ ప్రారంభంలో వెస్టర్న్ మ్యూజిక్ ను ఫాలో అవుతున్నాడంటూ ఎన్నో విమర్శలొచ్చాయి. వాటికి తన కంపోజింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు రెహమాన్. మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అందుకున్నాడు.

ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)
రెహమాన్ ఒక ఐకాన్. మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు... మంచి సింగర్, సాంగ్ రైటర్, మల్టీ ఇన్ట్రుమెంటలిస్ట్ కూడా. ఎన్నో సినిమాలకు పాటలు రాసి.. అద్భుతంగా పాడాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కంపోజ్ చేసాడు రెహమాన్. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ స్టయిల్‌ను, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, వెస్టర్న్ మ్యూజిక్‌లను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తాడు. వాటితో పూర్తిస్థాయిలో ఒరిజినల్ బాణీలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు.

ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)


వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఒక కల. ఆ లోటును రెహమాన్ తీర్చాడు. రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో కంపోజ్ చేసిన ‘జయహో’ పాటకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

ఆస్కార్ అవార్డులతో ఏ.ఆర్.రహమాన్ (ఫైల్ ఫోటో)


టైమ్ మ్యాగజైన్ రెహమాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత రెహమాన్‌కే దక్కుతుంది.

మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్‌తో ఏ.ఆర్.రహమాన్


జాతీయ స్థాయిలో ఆరు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హిందీ, తమిళ చిత్రాలకు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు.

అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఏ.ఆర్.రహమాన్


కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’, ‘పద్మభాషణ్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాడు.

అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్న రహమాన్


తెలుగులో కొన్ని సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం. ఆస్కార్ అవార్డులు అందుకున్న తర్వాత.. ఆ విజయం వంద కోట్ల భారతీయులదని చెప్పి దేశాభిమానాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తిత్వం అతని సొంతం. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటోంది న్యూస్ 18.

కైరా అద్వానీ హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి 

బోసిపోతున్న థియేట‌ర్లు.. సంక్రాంతి సినిమాలు వ‌చ్చేవ‌ర‌కు అంతే..

ముంబైని ఏల‌డానికి బ్యాగ్ వేసుకుని బ‌య‌ల్దేరిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

ఎన్టీఆర్‌కు సావిత్రి స‌వాల్.. ‘మ‌హాన‌టి’ని ‘క‌థానాయ‌కుడు’ మ‌రిపిస్తాడా..?

 
First published: January 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading