#HBD: పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న దీపికా

ఆమె అందం సౌందర్యానికే నిర్వచనంలా ఉంటుంది. ఆ నవ్వు విరబూసిన మల్లే కన్నా తెల్లగా ఉంటుంది. పూవుకు తావిలా...అందానికి అభినయం తోడై బాలీవుడ్‌ను ఏలుతున్న తార. ఆమె ఇంకెవరో కాదు బ్యూటిఫుల్, ఛార్మింగ్, క్యూట్, ఎనర్జిటిక్ కథానాయిక దీపికా పదుకోనె. రీసెంట్‌గా తన ఆన్ స్క్రీన్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఆఫ్ ది స్క్రీన్ పెళ్లి చేసుకుని ఒకింటామె అయింది. పెళ్లి తర్వాత దీపికా జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే ఆమె జీవితంలో మరిచిపోలేనిదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె నట ప్రస్థానంపై చిన్న లుక్.

news18-telugu
Updated: January 5, 2019, 10:39 AM IST
#HBD: పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న దీపికా
దీపిక పదుకొనే
  • Share this:
ఆమె అందం సౌందర్యానికే నిర్వచనంలా ఉంటుంది. ఆ నవ్వు విరబూసిన మల్లే కన్నా తెల్లగా ఉంటుంది. పూవుకు తావిలా...అందానికి అభినయం తోడై బాలీవుడ్‌ను ఏలుతున్న తార. ఆమె ఇంకెవరో కాదు బ్యూటిఫుల్, ఛార్మింగ్, క్యూట్, ఎనర్జిటిక్ కథానాయిక దీపికా పదుకోనె. రీసెంట్‌గా తన ఆన్ స్క్రీన్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఆఫ్ ది స్క్రీన్ పెళ్లి చేసుకుని ఒకింటామె అయింది. పెళ్లి తర్వాత దీపికా జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్ డే ఆమె జీవితంలో మరిచిపోలేనిదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె నట ప్రస్థానంపై చిన్న లుక్.

బ్యాడ్మెంటిన్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించి..మోడల్ గా మెరిసి, సిల్వర్ స్ర్కీన్ పై ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ దీపిక పదుకోనె. డెన్మార్క్ లోని కోపెన్ హగెన్లో  జనవరి 5, 1986లో ఉజ్వల, తండ్రి ప్రకాష్ పదుకోనెలకు జన్మించింది.దీపికకు పదకొండేళ్ల వయసులోనే దీపిక కుటుంబం ఇండియాకు వచ్చేశారు. బెంగుళూర్‌లో స్థిరపడ్డారు. తండ్రి  ప్రకాష్ పదుకోన్ అంతర్జాతీయ  బ్యాడ్మింటన్ క్రీడాకారుడు..దీపిక కూడా తండ్రిలాగే రాష్ట స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించింది..తరువాత మోడలింగ్‌లోకి వచ్చింది.
Deepika Padukone Dosa Goes Viral at a restaurant in Texas, US.. అవును.. ఇప్పుడు ఇదే అంటున్నారు అమెరికాలో. అక్కడి టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో దీపిక పదుకొనే దోశకు భలే గిరాకీ ఉంది. మన హీరోయిన్ పేరు మీద అమెరికాలో ఓ దోశ సండడి చేస్తుంది. ఎర్రటి మిర‌ప‌కాయల‌తో పాటు పైన ఆలు చిప్స్ కూడా వేసి దోర‌గా వేసిన దోశ‌నే ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ అంటూ అమ్మేస్తున్నారు రెస్టారెంట్ వాళ్లు. దీపిక దోశ‌కు ఇప్పుడు టెక్సాస్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. deepika padukone dosa,deepika padukone dosa texas,deepika padukone twitter,deepika dosa,deepika craze at texas,deepika padukone ranveer singh,deepika dosa at usa,deepika padukone dosa in america,deepika padukone Meghna Gulzar's laxmi agarwal, chiranjeevi dosa restaurant,chiranjeevi dosa,దీపిక పదుకొనే దోశ,దీపక పదుకొనే దోశ టెక్సాస్,దీపిక పదుకొనే దోశ అమెరికా,దీపిక పదుకొనే దోశ యుఎస్,చిరంజీవి దోశ,
దీపిక పదుకొనే ఫైల్ ఫోటో


ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, క్లోజప్ టూత్ పెస్ట్ వంటి వాటికి మోడలింగ్ చేసింది..కింగ్ ఫీషర్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ అఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. మోడలింగ్ తో వచ్చిన గుర్తింపుతో  హిమేష్ రేష్మియా ‌‘ఆప్ కా సరూర్’ ఆల్బంలో నటించే అవకాశం వచ్చింది.

నటిగా దీపికాకు మొదటి అవకాశం ఆమె మాతృభాష కన్నడలోనే వచ్చింది... 2006లో కన్నడలో ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐశ్వర్య’ అనే సినిమాలో తెరంగేట్రం చేసింది. రెండో సినిమాకే దీపికను అదృష్టం తలుపుతట్టింది. అది కూడా ఫరాఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ  సినిమానే ‘ఓం శాంతి ఓం’. ఈ సినిమాతో దీపిక బాలీవుడ్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా మొదలయ్యింది. ఈ సినిమాలో తన ఫర్శామెన్సతో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు  గెలుచుకుంది..ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఓం శాంతి ఓం మూవీలో షారుఖ్, దీపికా


ఆ తర్వతా.. దీపిక రణ్‌బీర్ కపూర్‌తోబచ్‌నా హై హసీనో , అక్షయ్ కూమర్‌తో ‘చాందిని చౌక్ టు చైనా’ సినిమాల్లో నటించింది. కొన్నిచిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నడవలేదు.ఇలాంటి సమయంలోనే ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో దీపిక కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టైంది. రొమాంటిక్ కామెడి డ్రామాగా వచ్చిన ఈ మూవీ లో సైఫ్అలీ ఖాన్‌కు జోడిగా నటించింది..ఆ సినిమా హిట్ అయింది.

వేడుకలో రెడ్‌గౌన్‌లో మెరిసిన దీపికా పదుకొణే (Image: Viral Bhayani)
వేడుకలో రెడ్‌గౌన్‌లో మెరిసిన దీపికా పదుకొణే (Image: Viral Bhayani)


2010లో దీపిక నటించి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ‘కార్తిక్ కాలింగ్ కార్తిక్’, ‘హౌస్‌ఫుల్’ ,‘బ్రేక్ కే బాద్’, ‘లఫంగే ఫరిందే’, కేలిన్ హమ్ జీ జాన్ సే (Khelein Hum Jee Jaan Sey ), కాక్‌టైల్ లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.

‘ఓమ్ శాంతి ఓం’ తర్వాత షారుక్ ఖాన్‌తో రెండో  సారి జోడి కట్టిన చిత్రం  ‘చెన్నై ఎక్స్ ప్రెస్...తమిల్ పొన్నుగా మీనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది దీపిక. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 2013 లో వచ్చిన ‘యే జవానీ హై దీవాని’ సూపర్ హిట్ అయ్యింది.

దీపికా పదుకొణే


సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ హీరో, హీరోయిన్లుగా రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి..ఒకటి రొమాంటిక్ ట్రాజడీ గా వచ్చిన ‘రామ్ లీల’ ఐతే ఇంకోటి హిస్టారికల్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ‘బాజీరావ్ మస్తానీ’..ఈ రెండు సినిమాలలో అందం, అభినయాలతో ప్రశంసలు అందుకుంది దీపిక.

దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కానుకగా విడుదలై తొలి రూ.100 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
పద్మావత్ మూవీ


ఆ తర్వాత ‘పద్మావత్’ సినిమాలో నటించిన..జోడిగా నటించలేదు. ఈ సినిమాలో దీపికా..భర్త రణ్‌వీర్..అల్లావుద్దీన్ ఖీల్జీ పాత్రలో విలనిజం పండించాడు. వెండితెరపై రణ్‌వీర్ సింగ్‌తో చేసిన రెండు సినిమాలు విషాదాంతమైన..నిజ జీవితంలో వారి ప్రేమ పెళ్లితో సుఖాంతమవడం విశేషం.

Ranveer singh Scored Huge Hit With Out Deepika Padukone First Time
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే (Image:AP)


ఇండియాన్ హేమ హేమి నటులు అమితా బచ్చన్,నషారుద్దిన్ షా లతో పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలో నటించింది దీపిక ..అమితా బచ్చన్‌తో ‘పీకూ’, నషారుద్దిన్ షాతో (Finding Fanny) ‘ఫైండింగ్ ఫన్ని’ మూవీలు  దీపిక నటనకు మంచి పేరు తీసుకోచ్చాయి. ‘పీకూ’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.

దీపికా నటనకు బాలీవుడ్ హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ‘XXX’కు సీక్వేల్ గా తెరకెక్కిన  ‘త్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ట్రిపుల్ గ్జాండర్ కేజ్’ మూవీతో హలీవుడ్లో అరంగేట్రం చేస్తుంది. లాస్ట్ ఇయర్ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఒకింటామె అయింది. షాదీ తర్వాత యాసిడ్ బాధితురాలు లక్ష్మీ పాత్రలో ‘చపాక్’ సినిమాకు ఓకే చెప్పింది. అంతేకాదు త్వరలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరనుంది.

మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న దీపికా మైనపు విగ్రహం


హర్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే ఎదైనా సాదించొచ్చు అని రుజువు చేసింది దీపిక...కెరీర్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న దీపికా ఇప్పుడొస్తున్నా ఎంతో మంది వర్థమాన నటీమణులకు రోల్ మోడల్‌గా నిలిచింది.

దీపిక పదుకొనే హాట్ ఫోటోస్..
Published by: Kiran Kumar Thanjavur
First published: January 5, 2019, 10:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading