హోమ్ /వార్తలు /సినిమా /

సంక్రాంతి వేళ దూసుకుపోతున్న సినిమాలు... కలెక్షన్ల కుమ్ముడు...

సంక్రాంతి వేళ దూసుకుపోతున్న సినిమాలు... కలెక్షన్ల కుమ్ముడు...

సంక్రాంతి వేళ దూసుకుపోతున్న సినిమాలు... కలెక్షన్ల కుమ్ముడు...

సంక్రాంతి వేళ దూసుకుపోతున్న సినిమాలు... కలెక్షన్ల కుమ్ముడు...

Happy Sankranti 2020 : ఈసారి సంక్రాంతి... టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చింది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Happy Sankranti 2020 : పండగ రోజుల్లో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లడం... సంక్రాంతి ఫెస్టివల్‌లో భాగమైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే... దర్శక నిర్మాతలు సరిగ్గా సంక్రాంతి టైమ్ చూసి... సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈసారీ అదే జరిగింది. ముందుగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా దర్బార్ హిట్ టాక్ తెచ్చుకొని... సంక్రాంతికి గుడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఆ ఏజ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్... అంత ఉత్సాహంతో నటించడం... మరోసారి భాషా సినిమా చూసిన ఫీల్ కలిగిందని ఫ్యాన్స్ తేల్చారు. తమిళ సినిమా హిట్టైంది కాబట్టి... తెలుగు సినిమాలు హిట్టవుతాయో లేదో అని తెలుగు ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడేంతలా దర్బార్ తెలుగు తెరపై సందడి చేసింది. ఇప్పటికే ఓవరాల్‌గా రూ.150 కోట్లు రాబట్టిన దర్బార్... తెలుగు సినిమాలు రిలీజయ్యాక... కాస్త వెనక్కి వెళ్లిపోయింది. బట్ పాజిటివ్ టాక్ మాత్రం అలాగే ఉంది.

నెక్ట్స్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరూ... మాస్ ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. ఫలితంగా కలెక్షన్లు కుమ్మేస్తోంది. రిలీజైన మూడ్రోజుల్లోనే ఈ సినిమా రూ.103 కోట్లు రాబట్టినట్లు చెబుతున్నారు. ప్రధానంగా... ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా... మహేష్ బాబు నటన, దానికి కామెడీని మిక్స్ చేసి... దర్శకుడు అనిల్ రావిపూడి... ప్రేక్షకులకు సంక్రాంతికి సెట్టయ్యే సినిమాని అందించారని ఫ్యా్న్స్ చెబుతున్నారు.


ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్‌లో వచ్చిన అల వైకుంఠపురం... క్లాస్ ఆడియన్స్‌కి తెగ నచ్చేస్తోంది. 15 నెలల గ్యాప్ తీసుకొని వచ్చిన అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా... సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఫ్యాన్సైతే... పండగ చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత బన్నీ నుంచీ అదిరిపోయే సినిమా వచ్చిందని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా దీన్ని చెప్పుకుంటున్నారు. ఈజీగా రూ.100 కోట్లు రాబట్టే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది.

ఇక ఇవాళ రిలీజైన ఎంత మంచివాడవురా... రిలీజ్‌కి ముందే... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పటాస్ లాగా... కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ హిట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తోనే రూపొందించడం, ఎక్కువ హైప్ లేకపోవడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యేలా ఉండటం ఇవన్నీ ఎంత మంచివాడవురాకి ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి.

ఇలా ఈ సంక్రాంతికి... దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అన్ని సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకోవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి అనుకోవచ్చు.

First published:

Tags: Sankranti 2020, Telugu Cinema, Telugu Movie News, Tollywood Cinema

ఉత్తమ కథలు