హోమ్ /వార్తలు /సినిమా /

Happy Holi 2023 : హిందీ తెరపై హోలీ సంబరాలు.. బాలీవుడ్‌లో రంగుల పండగపై తెరకెక్కిన టాప్ సాంగ్స్ ఇవే..

Happy Holi 2023 : హిందీ తెరపై హోలీ సంబరాలు.. బాలీవుడ్‌లో రంగుల పండగపై తెరకెక్కిన టాప్ సాంగ్స్ ఇవే..

బాలీవుడ్‌లో హోలి పాటలు (Twiter/Photo)

బాలీవుడ్‌లో హోలి పాటలు (Twiter/Photo)

Happy Holi 2023 | హోలీ అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఒకటి. కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు అంబరాన్ని తాకుతాయి. ఇక పండగను కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. బాలీవుడ్ చిత్రాలలో హోలీ సాంగ్స్ కి ప్రత్యేక స్థానంవుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Happy Holi 2022 : హోలీ అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఒకటి. కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు అంబరాన్ని తాకుతాయి. ఏడు రంగులను ఎదపై చల్లుకుని తడిసి ముద్దయి పుడమితల్లి రంగుల గంగతో పులకించిపోతుంది. చలికాలం పోయి వచ్చే వేసవి వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ. వసంతుని రాకతో పులకరించిన ప్రకృతిని చూసిన మనుషుల్లో అనేక వికారాలు ఉద్భవిస్తాయి. భౌతికమైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను విజ్ఞానమనే మంటల్లో తగలబెట్టి మంచి జీవితం గడపటమే ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం. ఇక పండగను కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. బాలీవుడ్ చిత్రాలలో హోలీ సాంగ్స్ కి ప్రత్యేక స్థానంవుంది.అలా హిందీ చిత్ర సీమలో అత్యంత ప్రజాదరణ పొంది చిరకాలం గుర్తుండి పోయే విధంగా తెరకెక్కించిన టాప్ 10 హోలీ గీతాల విశేషాలు మీకోసం.

1. అమితాబ్ బచ్చన్ మరియు రేఖ నటీనటులుగా డా. హరివంశ్ రాయ్ బచ్చన్ వ్రాసిన ,యాష్ చోప్రా చేత చిత్రీకరించిన రంగ్ బసేరా సాంగ్ "సిల్సిలా" (1981) చిత్రం లో అత్యంత ప్రజాదరణ పొందింది.

2. "హోలికేదిన్" అనే పాట షోలే (1975) చిత్రం లో పూర్తిగా హోలీ సాంప్రదాయ పద్ధతిలో చిత్రీకరించారు. హోలీ ప్రేమికుల ప్లే లిస్ట్ లో ఈపాట తప్పనిసరిగా ఉంటుంది.

3. అక్షయ్ కుమార్ మరియు హుమా ఖురేషి నటించిన ‘జాలీ ఎల్ఎల్‌బీ 2’ (2017) చిత్రం లో "గో పాగల్" పేరుతో హోలీ సాంగ్ లో అక్షయ్ కుమార్ డాన్స్ హైలైట్‌గా నిలిచింది.

4. హోలీ పాటల జాబితాలో ఒకటైన "బాలం పిచ్కరి" సాంగ్ అద్భుతమైన సరదా బీట్స్ తో యువతరాన్ని ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ‘యే జవానీ హై దివాని’ (2013) చిత్రంలోనిది.

5. "గాలీ గాలీ" లిరిక్స్ తో సాగె ఈ సాంగ్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ‘పటాక’ (2018) చిత్రం లో ఉన్న ఈ  పాట వినడంతో పాటు చూస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

6. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ హీరోలుగా తెరకెక్కిన ‘మొహబ్బతే’ (2000) చిత్రంలో ని "సోనీ సోనీ" అనిసాగే ఈ సాంగ్ మూడు జంటల మధ్య ప్రేమ మరియు హోలీ స్ఫూర్తి తో సాగుతూ ఆకట్టుకుంటుంది.

7. బాగ్బాన్ (2003), సమీర్ రాసిన "హోలీ ఖేలే రఘువీరా" అనే సాంగ్లో సాహిత్యంతో పాటు పల్లెటూరి హోలీ వాతావరణాన్ని తలపిస్తుంది.

8. సంజయ్ లీలా భన్సాలి నిర్మించిన రామ్-లీలా (2013) చిత్రం లో "లాహు ముహ్ లగ్ గయా" అనే సాంగ్ ఒక హైలైట్.

9.  అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌ నటించిన ‘వఖ్త్’ (2005) చిత్రంలో ఫాస్టబీట్ హోలీసాంగ్ "డూ మీ ఆ ఫేవర్ లెట్స్ ప్లే హోలీ " పాట కూడా అత్యంత ప్రజాదరణ పొందింది.

10.బద్రీ కీ దుల్హనియా అని సాగె హోలీ స్పెషల్ సాంగ్ బద్రీనాథ్ కీ దుల్హనియా (2017) చిత్రం లోనిది పార్టీ కల్చర్ తో సాగె ఈ సాంగ్ ఈ మూవీ హైలైట్..వీటితో పాటు బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో సందర్భాను సారంగా ఎన్నో హోళీ పాటలను తెరకెక్కించారు దర్శక,నిర్మాతలు.

First published:

Tags: Amitabh bachchan, Bollywood news, Holi 2023, Ranveer Singh