Happy Holi 2020: హోళీ పండగపై తెలుగులో వచ్చిన టాప్ సాంగ్స్ ఇవే..

Happy Holi 2020 | కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. హోలీ పండుగ సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..అలా తెలుగు చిత్ర సీమలో ఫేమసై హోళీ పాటలేంటో ఓ సారి చూద్దాం..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 9, 2020, 10:31 AM IST
Happy Holi 2020: హోళీ పండగపై తెలుగులో వచ్చిన టాప్ సాంగ్స్ ఇవే..
టాలీవుడ్ హోలీ
  • Share this:
కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు అంబరాన్ని తాకుతాయి. ఏడు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని తడిసి ముద్దయి పుడమితల్లి రంగుల గంగతో పులకించిపోతుంది. చలికాలం పోయి వచ్చే వేసవి వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోళి. వసంతుని రాకతో పులకరించిన ప్రకృతిని చూసిన మనుషుల్లో అనేక వికారాలు ఉద్భవిస్తాయి. భౌతికమైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను విజ్ఞానమనే మంటల్లో తగలబెట్టి మంచి జీవితం గడపటమే ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం. హోలీ పండుగ సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..అలా తెలుగు చిత్ర సీమలో ఫేమసై హోళీ పాటలేంటో ఓ సారి చూద్దాం.. ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ పండుగ నిజ జీవితంలో ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో.. అదే సీన్ తెరపై కనిపిస్తే.. ఆ సీన్ కు మంచి మ్యూజిక్ తోడైతే.. చక్రం సినిమాలో సిరివెన్నెల రాసిన రంగేలీ హోలీ  పాట సూపర్ హిట్ ఉంటుంది. ప్రభాస్, చార్మీలు రంగుల వర్షంలో తడిసారు.కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో కూడా రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు అంటూ రంగులు పూసుకున్నాడు  జూనియర్ ఎన్టీఆర్.ఇక రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమాలోనూ నాగార్జున రంగుల్లో మునిగి తేలాడు. సాహితి రాసిన కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు అంటూ నాగ్ హోలీ సెలబ్రేట్ చేశాడు.మాస్ కంటే ముందు నాగ్.. సీతారామ రాజు సినిమాలో రంగులు పూసుకున్నాడు. నందమూరి హరికృష్ణతో కలిసి ఈ సినిమాలో కూడా హోలీ సంబరాలు చేసుకున్నారు.

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాలోనూ హోలీహోలీ పండగల్లే ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది నాలో అని చల్లుకున్నాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తమన్నాతో కలిసి రంగులు చల్లుకున్నాడు.ఇప్పటి హీరోలు మాత్రమే కాదు.. అప్పటి హీరోలు కూడా హోలీ రంగుల్లో మునిగితేలారు. 1987లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమాలో కమల్ హాసన్ రంగులు జల్లుకున్నారు.కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పదరేళ్ల వయసు సినిమాలో వయస్సంత ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకుందాం.. లాంటి పాటలు బావ మరదలు మధ్య ఉండే హోలీ సరదాలను చూపించింది.వెంకటేష్ హీరోగా నటించిన ‘జెమిని’ సినిమాలోని దిల్ దీవానా’ కూడా హోలీ నేపథ్యంలో తెరకెక్కింది.అనేక సినిమాల్లో హోలీ సన్నివేశాలు తెలుగు తెర మీద రంగులను పులిమాయి. నీస్నేహం, ఇంద్ర, ఓయ్, హోలీ లాంటి సినిమాల్లో హోలీ సీన్స్ తో హీరోలు రంగులు పూసుకున్నారు.ఇది ప్రకృతి పండగ. ప్రకృతిలో దొరికే సహాజసిద్దమైన పూలతో తయారు చేసిన రంగులు పూసుకోవడం ఈ పండగ ప్రత్యేకత. ముఖ్యంగా మోదుగుపూలతో రంగును తయారు చేసి జల్లుకుంటారు. అది ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది.


ఎలాంటి రసాయనాలు లేకుండా వాడితే.. పొల్యుషన్ కూడా పాడవ్వకుండా ఉంటుంది.అందుకోసం.. ప్రతిఒక్కరూ రసాయన రంగులకు బదులుగా సంప్రదాయ రంగులను వాడి.. తమ జీవితాల్లో రంగులను నింపాలని కోరుకుందాం.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 9, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading