• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HAPPY FRIENDSHIPDAY RRR DIRECTOR RAJAMOULI BEST FRIEND HERE ARE THE DETAILS TA

Friendship Day: దర్శకధీరుడు రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

Friendship Day: దర్శకధీరుడు రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

రాజమౌళి (File/Photo)

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమాతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో దర్శకధీరుడు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

  • Share this:
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమాతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల రాజమౌళి. ప్రముఖ తెలుగు దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎన్టీఆర్ జూనియర్ హీరోగా  ‘స్టూడెంట్ నెంబర్.1’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత సింహాద్రి, యమదొంగ, మగధీర, బాహుబలి సిరీస్‌తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు దేశ వ్యాప్తంగా బాహుబలి సినిమాతో అన్ని రికార్డులను తిరగరాసాడు.ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో రాజమౌళితో ఒక్క సినిమానైనా చేయాలని కోరకుంటున్నారు. అలాంటి రాజమౌళి ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్‌తో మంచి స్నేహమే ఉంది. కానీ ఎన్టీఆర్ కంటే రాజమౌళి మరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనే సాయి కొర్రపాటి. ఈయనే రాజమౌళి ఇండస్ట్రీలో మంచి స్నేహితుడంట.

    వారాహీ చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటితో రాజమౌళి (Twitter/Photo)


    ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఎన్నో చిత్రాలను ఈయన డిస్ట్రిబ్యూట్ చేసాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది సక్సెస్‌ఫుల్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: