#Happyfriendshipday: ప్రేమగీతాలే కాదు...ఈ స్నేహ గీతాలు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీనే...

స్నేహం గొప్పతనాన్ని విశదీకరిస్తూ తెలుగు సినిమాల్లో వచ్చిన టాప్ టెన్ సాంగ్స్ మీ కోసం..

news18-telugu
Updated: August 4, 2019, 6:54 PM IST
#Happyfriendshipday: ప్రేమగీతాలే కాదు...ఈ స్నేహ గీతాలు కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీనే...
టాలివుడ్ స్నేహగీతం
  • Share this:
సంతోషం, బాధ, ఆనందం, దు:ఖం ఇలా ఏ ఫీలింగ్ అయినా పంచుకోవాలంటే, గుర్తొచ్చేది స్నేహితుడు మాత్రమే. అలాంటి అపూర్వమైన బంధమే స్నేహం. ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. స్నేహానికి జాతి, కులం, ప్రాంతం, మతం, వర్గం అనేవి ఉండవు. ఎల్లలు లేనిది స్నేహం బంధంమే అలాంటి స్నేహానికి గుర్తుగా ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం విశేషం. స్నేహం గొప్పతనాన్ని విశదీకరిస్తూ తెలుగు సినిమాల్లో వచ్చిన టాప్ టెన్ సాంగ్స్ మీ కోసం..మహర్షి సినిమాలోని చోటి చోటి బాతెన్ పాట స్నేహం గురించి ఈ మధ్యకాలంలో వచ్చిన స్నేహ గీతాల్లో ఒకటనే చెప్పవచ్చు.

స్నేహం విలువను చాటిచెబుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని మీసమున్న నేస్తమా పాట ఇప్పటికీ ప్రతీ స్నేహితుడి మదిని తాకుందంటే అతిశయోక్తి కాదు...ప్రాణానికి ప్రాణం సినిమాలో బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య చిత్రించిన ఈశ్వర్ అల్లా తేరే నామ్ గీతం ఇప్పటికీ అభిమానులకు స్నేహం విలువను గుర్తు చేసే గీతంగా మిగిలిపోయింది.

యువతి యువకుల మధ్య కేవలం ప్రేమ మాత్రమే కాదు పవిత్రమైన స్నేహ బంధం కూడా ఉంటుందని చాటిచెప్పిన చిత్రం వసంతం. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణి మధ్య చిత్రించిన గాలి చిరుగాలి పాట ఇప్పటికీ ఆడియన్స్ ను కన్నీళ్లు పెట్టిస్తుంది.సుమంత్, నాగార్జున నటించిన స్నేహమంటే ఇదేరా సాంగ్ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గీతాల్లో ఒకటి..ఇటీవలి కాలంలో యూత్ ను ఉర్రూతలూగించిన చిత్రం హ్యాపీడేస్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం, కాలేజీ స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని సిల్వర్ స్క్రీన్ పై కళ్లకు కట్టినట్లుగా చూపించి చరిత్ర సృష్టించింది. ఆ సినిమాలోని ఓ మై ఫ్రెండ్ ప్రతీ స్నేహితుడి మదిని తడుతుంది.స్నేహితుల దినోత్సవం అనగానే గుర్తొచ్చే మరో ఎవర్ గ్రీన్ సాంగ్ ప్రేమ దేశం చిత్రంలోని ముస్తఫా ముస్తఫా అనే చెప్పవచ్చు. ఈ పాట వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ యూత్ కు కనెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదు.ఇక స్నేహం విలువను చాటి చెప్పిన మరో గీతం దళపతి చిత్రంలోని సింగారాల పైరులోన ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంటుంది. సూపర్ స్టార్ రజినీ, మళయాళ మెగాస్టార్ మమ్మూట్టీ కలిసి నటించిన ఈ పాటను ఎస్పీ బాలు, జేసుదాస్ గాత్రంతో తిరుగులేని ఎవర్ గ్రీన్ సాంగ్ గా మారిపోయింది.

స్నేహం విలువ చెప్పిన మరోపాట నిప్పులాంటి మనిషిలో స్నేహమేరా జీవితం ఈ పాటలో ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన ఈ చిత్రంలో ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది.స్నేహమనే అపూర్వ బంధాన్ని గుర్తు చేస్తూ ప్రాణస్నేహితులు చిత్రంలో వచ్చిన "స్నేహాని కన్న మిన్న" పాట కూడా ప్రేక్షకులను ఇప్పటికీ ఆదరణ పొందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.కొంతకాలం కిందట అంటూ నీ స్నేహం సినిమాలో వచ్చిన ఈ పాట, ఇప్పటికీ ఆకట్టుకుంటేనే ఉంది.ఇటీవలి కాలంలో స్నేహం విలువను చాటిన మరో పాట ట్రెండు మారినా అంటూ యూత్ నోళ్లలో నిత్యం నానుతూనే ఉంది.అనుబంధం సినిమాలో అక్కినేని, ప్రభాకర్ రెడ్డి స్నేహ బంధాన్ని వివరిస్తూ చిత్రించిన ఆనాటి ఆ స్నేహగీతం పాట ఇప్పటికీ రింగుమని మోగుతూనే ఉంది.ఇక ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అనే పాటల్లో పెళ్లి పందిరి సినిమాలో దోస్త్ మేరా దోస్త్ పాట ఒకటి, స్నేహం గొప్పతనం గుర్తుచేసే ఈ పాటను స్నేహితులంతా గుర్తుచేసుకుంటారు.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు