#HBDPrabhas: రికార్డుల బాహుబలి.. సాహోరే ‘ప్రభాస్’..

ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్‌గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ పుట్టినరోజు నేడు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 23, 2019, 8:20 AM IST
#HBDPrabhas: రికార్డుల బాహుబలి.. సాహోరే ‘ప్రభాస్’..
ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్‌గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ‘ఈశ్వర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘ఛత్రపతి’తో యాక్షన్ హీరోగా...‘బుజ్జిగాడు’తో మాస్ హీరోగా అలరించి...‘బాహుబలి’తో హాలీవుడ్ వరకూ తన సత్తా చాటాడు ప్రభాస్.

బాహుబలిలో ప్రభాస్


బాహుబలి సిరీస్‌తో భారతీయ ప్రేక్షకులతో సాహో అనిపించిన ప్రభాస్...1979 అక్టోబర్ 23న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. 2002లో కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

happy birthday prabhas,prabhas birthday,prabhas birthday special video,prabhas,prabhas birthday special,prabhas birthday celebrations,prabhas,prabhas movies,saaho prabhas,prabhas birthday,prabhas interview,#prabhas,prabhas saaho,prabhas birthday special,prabhas craze,prabhas birthday celebrations,prabhas new song,prabhas marriage,prabhas birthday special gift for fans,prabhas and anushka,prabhas birthday date,prabhas birthday song,happy birthday prabhas,prabhas shraddha kapoor,prabhas birthday videos,prabhas interview saaho,shraddha kapoor about prabhas,prabhas birthday videos,prabhas birthday 2019,#happy birthday prabhas,prabhas birthday date,prabhas birthday special whatsapp status,happy birthday prabhas status,prabhas movies,prabhas new movie,happy birthday prabhas best status,prabhas birthday special videos,happ birthday prabhas,tollywood,bollywood,hindi cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ మూవీస్,పుట్టినరోజు ప్రభాస్,ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,ప్రభాస్ ఇంటర్వ్యూ,ప్రభాస్ సినిమాలు,ప్రభాస్ సామో కలెక్షన్స్,ప్రభాస్ సాహో మూవీ,ప్రభాస్ న్యూ మూవీ
ఈశ్వర్ మూవీ (File Photo)




‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ...2004లో చేసిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ సినీకెరీర్‌ను మలుపు తిప్పింది. హీరోగా ప్రభాస్‌కు మూడో సినిమా. ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

వర్షంలో ప్రభాస్


ఆ తర్వాత ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ‘చక్రం’ మూవీతో డిఫరెంట్ మూవీస్ చేయగలడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్.
Loading...
అడివిరాముడులో ప్రభాస్


ప్రభాస్ సినీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. సెంటిమెంట్ ను కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయింది.

ఛత్రపతి ప్రభాస్


‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ విభిన్న పాత్రలను పోషించాడు. ‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్  సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించాడు.

ప్రభాస్


బిల్లా మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు ప్రభాస్. ఈ సినిమాలో డబుల్ రోల్ తో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ గా కనిపించాడు. మాస్ పాత్రలు మాత్రమే కాకుండా ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో.. ప్రభాస్‌లోని నటుడిని చూశారు. ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు ప్రభాస్.ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచిన మూవీ ‘మిర్చి’. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. ఈ సినిమా లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

మిర్చిలో ప్రభాస్


తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇక బాహుబలి 2 పార్ట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాడు.

ప్రభాస్ ‘సాహో’


ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్‌లోని  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న  ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్.

బాహుబలి


రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా.. వీళ్లిద్దరి కలిసి నటించడం ఫ్యాన్స్‌కు ఆనందాన్నిఇచ్చింది. 

పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్..పదిహేడేళ్ల సినీ కెరీర్‌లో ‘సాహో’ తో కలపి ఇప్పటి వరకు పందొమ్మిది సినిమాలు చేసాడు. హిందీలో అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ రోల్ చేసాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మదిలో డార్లింగ్‌గా, ‘ఛత్రపతి’గా, ‘బాహుబలి’గా చెరగని ముద్రవేసాడు.  తాజాగాా ‘సాహో’ తో పలకరించాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో  పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.

happy birthday prabhas,prabhas birthday,prabhas birthday special video,prabhas,prabhas birthday special,prabhas birthday celebrations,prabhas,prabhas movies,saaho prabhas,prabhas birthday,prabhas interview,#prabhas,prabhas saaho,prabhas birthday special,prabhas craze,prabhas birthday celebrations,prabhas new song,prabhas marriage,prabhas birthday special gift for fans,prabhas and anushka,prabhas birthday date,prabhas birthday song,happy birthday prabhas,prabhas shraddha kapoor,prabhas birthday videos,prabhas interview saaho,shraddha kapoor about prabhas,prabhas birthday videos,prabhas birthday 2019,#happy birthday prabhas,prabhas birthday date,prabhas birthday special whatsapp status,happy birthday prabhas status,prabhas movies,prabhas new movie,happy birthday prabhas best status,prabhas birthday special videos,happ birthday prabhas,tollywood,bollywood,hindi cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ మూవీస్,పుట్టినరోజు ప్రభాస్,ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు,ప్రభాస్ ఇంటర్వ్యూ,ప్రభాస్ సినిమాలు,ప్రభాస్ సామో కలెక్షన్స్,ప్రభాస్ సాహో మూవీ,ప్రభాస్ న్యూ మూవీ
ప్రభాస్ తాజా చిత్రం (Twitter/Photo)


మొత్తానికి ఈ యేడాది ‘సాహో’  అంటూ ప్రభాస్ సందడి చేసిన   ప్రభాస్...ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిద్దాం.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com