• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HAPPY BIRTHDAY VIJAY DEVARAKONDA LIGER TEASER POSTPONED DUE TO THIS REASON SR

Happy Birthday Vijay Devarakonda : టీజర్ విడుదలను పోస్ట్ పోన్ చేసిన లైగర్ టీమ్.. కారణం ఇదే...

Happy Birthday Vijay Devarakonda : టీజర్ విడుదలను పోస్ట్ పోన్ చేసిన లైగర్ టీమ్.. కారణం ఇదే...

Vijay Devarakonda in liger Photo : Twitter

Happy Birthday Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా లెవల్‌లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రం లైగర్ (Liger ). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

  • Share this:
    విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా లెవల్‌లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రం లైగర్ (Liger ). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈరోజు విజయ్ తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న లైగర్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎందరో సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలను విడుస్తున్నారు. దీన్ని ద‌ృష్టిలో పెట్టుకుని లైగర్ నుంచి ఎటువంటీ అప్ డేట్ ఇవ్వడం లేదని.. టీజర్‌ విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేసింది లైగర్ టీమ్. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )లైగర్ సినిమాతో ఈ సారి పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే  (Ananya Panday) నటిస్తోంది.


    ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. అది అలా ఉంటే విజయ్ మరో హిందీ సినిమాకు సై అన్నట్లు టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మన రౌడీ హీరోని ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుందట కత్రీనా. ఈ సినిమాను కూడా కరణ్ జోహారే నిర్మించనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు