మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డ.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. అది అలా ఉంటే వరుణ్ ఈరోజు తన 31వపుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న తాజా చిత్రం నుంచి మోషన్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్లో వరుణ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌లో కేకపెట్టిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపేరును గనిగా ఖారారు చేసారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినా.. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో మొదలైంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఆ సినిమాలో వరుణ్ తన నటనతో అదరగొట్టాడు. ఆ తర్వాత మరో ప్రయోగం కంచె. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి వరుణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ వంటి రఫ్ పాత్ర చేసి మరో కోణం చూపించాడు. ఇక ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ 'f2' సినిమాలు వరుణ్ కెరీర్‌కు మంచి మైలేజ్‌ను ఇచ్చాయి. ఇక ఆ మధ్య ‘గద్దలకొండ గణేష్’ అంటూ ఊరమాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టాడు వరుణ్. ఈ సినిమా వరుణ్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.
Published by:Suresh Rachamalla
First published:January 19, 2021, 10:52 IST