HBDThaman: అల సంగీత ప్రపంచంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్..

నేడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పుట్టినరోజు (Twitter/Photo)

Happy Birthday Music Director SS Thaman : తమన్ ప్రస్తుతం సంగీత ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ఈరోజు తమన్ పుట్టినరోజు. 

 • Share this:
  Happy Birthday Music Director SS Thaman : తమన్ ప్రస్తుతం సంగీత ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ఈరోజు తమన్ పుట్టినరోజు.  ఈయన 16 నవంబర్ 1983లో నెల్లూరులో జన్మించారు.   ఈయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇంత పేరు సంపాదించడం అంతా ఆషామాషీగా జరగలేదు. 13 యేళ్లు చిన్న వయసులో నాన్నను పోగట్టుకున్న తమన్.. ఆ తర్వాత చదవుకు స్వస్తి చెప్పి.. తన అభిరుచి ఉన్న సంగీత రంగాన్ని ఎంచుకున్నాడు. లేేలేత వయసులోనే డ్రమ్మర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒక్కో మెట్టు పైకెక్కుతూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్. ఈయన ఫేమస్ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. నెల్లూరు ఈయన నేటివ్ ప్లేస్. కానీ ఈయన చిన్నతనం మొత్తం చెన్నైలోనే పెరిగాడు.

  తమన్ మ్యూజిక్ డైరెక్టర్ (Twitter/Photo)


  తమన్ తండ్రి అశోక్ కుమార్.. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్ములు వాయించేవాడు. అమ్మ సావిత్ర ప్రముఖ నేపథ్య గాయని. ఇలా చిన్నప్పటి నుంచే ఇంటి వాతావరణంతో తమన్ అడుగులు మ్యూజిక్ పై పడ్డాయి. ఆరేళ్లకే డ్రమ్ములు వాయించడం మొదలు పెట్టాడు. ఇక అమ్మ, నాన్న వెళ్లే ప్రతి స్టూడియోలకు వెళ్లేవాడు. అలా ఓసారి తమన్ తండ్రి విదేశాల నుంచి డ్రమ్ములు తీసుకొచ్చారు. ఆ డ్రమ్ములతో ఇంటి చుట్టుపక్కల జరిగే పండగల్లో డ్రమ్ములు వాయించేవాడు తమన్.

  మహేష్ బాబుతో తమన్ (Twitter/Photo)


  పదమూడేళ్ల చిన్న వయసులోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ సంగీతం అందిస్తోన్న ‘భైరవ ద్వీపం’ సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేసారు. ఆ సినిమాకు రూ. 30 తొలి పారితోషకం అందుకున్నారు తమన్. రోజుకు రూ. 30 నుంచి రోజుకు రూ. 3000 పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగాడు తమన్. ఆరో తరగతిలోనే తండ్రి కనుమూయడంతో కుటుంబ భారం తనపై పడింది. దీంతో ఎస్పీ బాలు, రాజ్ కోటి, మాధవపెద్ది సురేష్, గంగై అమరన్, శివమణి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసాడు. శంకర్‌కు  తను తెరకెక్కించబోయే  ‘బాయ్స్’ సినిమాలో నిజంగా డ్రమ్మర్ వాయించేవారు కావలనడంతో ఏ.ఆర్.రహమాన్.. అప్పటికే డ్రమ్మర్‌గా అందరికీ సుపరిచితమైన తమన్‌ను శంకర్‌కు పరిచయం చేసాడు. అలా బాయ్స్ సినిమాలో నటించే అవకాశం దక్కింది తమన్‌కు.

  ‘బాయ్స్’ మూవీతో తెరకు పరిచయమైన తమన్ (Twitter/Photo)


  ఇక మణిశర్ ‘ఒక్కడు’ సినిమాకు పనిచేయడం తన లైఫ్‌ను మార్చేసిందని తమన్ అంటుంటారు. తమన్‌కు 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర దాదాపు 900 సినిమాలకు పనిచేసాడు. తెలుగుతో పాటు మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్, కన్నడ,.. భాషా భేదం లేకుండా నెంబర్ 1 డ్రమ్మర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో డ్రమ్మర్‌గా రూ. 40 వేలు ఛార్జ్ చేసేంత స్థాయికి ఎదిగాడు. 24 ఏళ్ల వయసులో తమిళంలో ఓ సినిమాతో సంగీత దర్శకుడిగా  అవకాశం వచ్చింది.  ఆ తర్వాత అన్ని భాష‌ల్లోనూ త‌మ‌న్ సంచ‌ల‌నాలు సాగాయి. తెలుగులో "కిక్" సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ తర్వాత అతికొద్ది కాలంలో తెలుగు స్టార్ హీరోలందరితోనూ పనిచేసాడు. కెరీర్ మొద‌ట్లో "బృందావ‌నం".. "దూకుడు".. "బిజినెస్‌మ్యాన్" లాంటి సినిమాల‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమ‌న్. ఆ త‌ర్వాత కాస్త రేస్‌లో వెన‌క‌బ‌డినా కూడా వెంట‌నే మ‌ళ్లీ స్టార్ హీరోల సినిమాల‌తో తన సత్తా ఏందో చూపెట్టాడు.

  బాలకృష్ణతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Twitter/Photo)


  2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీతో సంగీత దర్శకుడిగా వంద సినిమాలు కంప్లీట్ చేసుకున్నట్టు తమన్ ట్వీట్ చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప‌దేళ్ళ గ్యాప్‌లోనే 100 సినిమాలు పూర్తి చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. తెలుగులో మ‌ణిశ‌ర్మకు కాకుండా ఈ మ‌ధ్య కాలంలో 100 సినిమాలు పూర్తి చేసిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు లేరు.

  SS Thaman Completed 100 movies with Aravinda Sametha Veera Raghava.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. 100 సినిమాలు పూర్తయ్యాయా లేదా అనేది కావాలి. ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పాలనిపిస్తుంది. పదేళ్లు కూడా కాలేదు అప్పుడే 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు థమన్. ఆయన కంటే ముందు వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా 80 ల్లోనే ఉంటే ఈయన మాత్రం అప్పుడే సెంచరీ కొట్టేసాడు. అసలు పడినా లేచినా థమన్ 100 సినిమాల ప్రయాణం మాత్రం అద్భుతమే. థమన్,థమన్ 100 సినిమాలు,పదేళ్లలో 100 సినిమాలు చేసిన థమన్, 100 సినిమాలు పూర్తి చేసిన థమన్,అరవింద సమేతతో థమన్ 100 సినిమాలు,థమన్ 100వ సినిమా అరవింద సమేత,కిక్,ఎస్ఎస్ థమన్,ss thaman,thaman 100 movies completed,thaman 100th movie aravinda sametha,ntr,trivikram,thaman 100 movies in 10 years,kick
  థమన్ ఫేస్ బుక్ ఫోటో


  పదేళ్ల కెరీర్‌లో థమన్ ఎన్నో సినిమాలు చేసినా...అసలు ఆయన కెరీర్ మొదలైంది 1994లో రిలీజైన ‘భైరవ ద్వీపం’ సినిమాతో. ఈ మూవీతో థమన్ ప్రయాణం 1993 నవంబర్ 21న ప్రారంభైంది. అంటే నేటితో థమన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి  27 యేళ్లు కంప్లీట్ అవుతోంది. ‘బైరవ ద్వీపం’ మూవీకి మాధవపెద్ది సురేష్ సంగీతాన్ని అందించారు.ఈ 27  యేళ్లలో 7000 స్టేజ్ షోస్‌లో థమన్ తన మ్యూజిక్‌తో అలరించాడు. అంతేకాదు 111 ట్రూప్స్‌లో డ్రమ్మర్‌గా తన సత్తా చూపించాడు. 41 జింగిల్స్‌ కంపోజ్ చేసాడు. అంతేకాదు పూర్తి స్థాయి సంగీత దర్శకుడు కాక ముందు 67 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర 900 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసాడు.

  థమన్ ఫేస్ బుక్ ఫోటో


  ఇన్ని మూవీస్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తే కానీ...సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం రాలేదు. 2017‘గోల్‌మాల్4’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్.. ఆ తర్వాత ‘సింబా’ మూవీకి సంగీతం అందించాడు. ఈ యేడాది త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరోసారి సంచనలం రేపాడు. తెలుగులో అతిపెద్ద మ్యూజిక్ ఆల్బమ్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలోని పాటలు.. ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ పాట ఇప్పటికే 440 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టింది. ఆ తర్వాత అందులో మరో మూడు పాటలు కూడా 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టడం విశేషం. మొత్తానికి ఈ ఇరవై యేడేళ్ల కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు తన సంగీతంతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు తమన్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: