Chandra Mohan: శోభన్‌బాబును కృష్ణను ఆ విధంగా భయపెట్టిన చంద్ర మోహన్..

HBDChandraMohan: చంద్ర మోహన్..  ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 54 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్. ఓ సందర్భంలో కృష్ణ, శోభన్ బాబు కూడా చంద్ర మోహన్ టాలెంట్ చూసి భయపడి పోయారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 23, 2020, 5:52 PM IST
Chandra Mohan: శోభన్‌బాబును కృష్ణను ఆ విధంగా భయపెట్టిన చంద్ర మోహన్..
చంద్ర మోహన్ (File/Photo)
  • Share this:
చంద్ర మోహన్..  ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 54 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్న అనుభవం.. కలిపితే చంద్రమోహన్. రంగుల రాట్నంతో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకన్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. చంద్ర మోహన్ స్పెషాలిటీ ఏమిటంటే.. అప్పట్లో  ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది. చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు.

చంద్ర మోహన్‌కు పేరు తెచ్చిన చిత్రాలు (Twitter/Photo)


చంద్ర మోహన్ నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించాడు.
చంద్రమోహన్..1945, మే 23న కృష్ణాజిల్లాలో పుట్టారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ లో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారాయన. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సిరిసిరి మువ్వ సూపర్ డూపర్ హిట్.

సిరి సిరి మువ్వ లో చంద్ర మోహన్ (Youtube/Credit)


తొలినాళ్లలో కొత్త నీరు వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా మార్చుకున్నారు. బంగారు పిచుక వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చాడు.  గంగ మంగ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించాడు.  సినిమాలో తనది హీరో కేరెక్టరా.. కాదా? అని చూసుకున్నదే లేదు చంద్రమోహన్. వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమనే థియరీ పక్కాగా ఫాలో అయ్యారాయన. చంద్రమోహన్ నటించిన ‘ఓ సీత కథ’తో వేటూరి గీతరచయితగా పరిచయం కావడం విశేషం.

ఓ సీత కథలో చంద్ర మోహన్ (youtube/Credit)
గంధము పూయరుగా అనే పాట మీరు వినేవుంటారు. ఈ పాట శుభోదయం అనే సినిమాలోనిది. ఇందులో చంద్రం అనే పాత్ర వేశారు చంద్రమోహన్. పక్కింటి అమ్మాయి అనే సినిమా గుర్తుందా? జయసుధ, ఎస్పీబీ, చక్రవర్తి యాక్ట్ చేసిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ఓ పెద్ద హిట్. అంతే కాదు పాటలన్నీ చాలా సూపర్ హిట్. ఇటు హీరోగా.. అటు కేరెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ కెరీర్ లో అనేక హిట్లందుకున్నారు చంద్రమోహన్. రెండు రెండ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారాయన.

జయమ్ము నిశ్చయమ్మురా‌లో చంద్ర మోహన్ (Youtube/Credit)


అల్లుడు గారు తో ఫుల్ టైం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన గులాబీతో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచీ వరుస సినిమాలు. నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100 పర్శెంట్ ఫిట్ అనిపించుకున్నారు. అతనొక్కడే చిత్రానికిగానూ చంద్రమోహన్ బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డునందుకున్నారు.

చంద్ర మోహన్ (Twitter/Photo)


దూకుడు, యముడికి మొగుడు ఇలా చంద్రమోహన్ కెరీర్ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే వుందింకా.. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. నిర్మాణమని అదనీ ఇదనీ ఆయన ఎక్కడా కంట్రోల్ తప్పలేదు. నష్టాలను చవిచూడలేదు. ఒకటీ అరా సందర్భాల్లో తప్పితే వివాదాస్పదమూ అవలేదు.మొత్తానికి  సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర మోహన్‌కు న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading