HAPPY BIRTHDAY TOLLYWOOD DYNAMIC DIRECTOR GUNASEKHAR DO YOU KNOW FACTS ABOUT HIS FIM CAREER TA
HBD Gunasekhar: హ్యాపీ బర్త్ డే గుణశేఖర్.. ఈ తరంలో ఏ డైరెక్టర్‌కు లేని ప్రత్యేకత ఈయనకు మాత్రమే సొంతం..
హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ గుణశేఖర్ (Twitter/Photo)
HBD Gunasekhar | టాలీవుడ్లో ఈ జనరేషన్లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు ఈయన పుట్టినరోజు
HBD Gunasekhar: టాలీవుడ్లో ఈ జనరేషన్లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం. వివరాల్లోకి వెళితే.. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గుణశేఖర్. దర్శకుడిగా మారక ముందు ప్రముఖ రచయతలు డీవీ నరస రాజు, ప్రముఖ దర్శకులు క్రాంతి కుమార్, రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు. ఇక దర్శకుడిగా గుణశేఖర్ మొదటి చిత్రం 1992లో ‘లాఠీ’ చిత్రం. ప్రశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన దర్శకుడిగా గుణశేఖర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత నరేష్, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా ‘సొగసు చూడతరమా’ అనే సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్లో వచ్చిన ‘ఇన్సిడెంట్ ప్రపోజల్’ మూవీని తెలుగు నెటివిటీకి తగ్గట్టు తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమాతో ఉత్తమ చిత్రంగా నంది అవార్డుతో పాటు ఉత్తమ నటుడిగా నరేష్ నంది అవార్డు అందుకున్నారు.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో అంతా చిన్నపిల్లలతో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమా దర్శకుడిగా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ (Twitter/Jr NTR)
అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌కు రాముడిగా మంచి పేరొచ్చింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో ‘చూడాలనివుంది’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నారు. ఆ తర్వాత తీసిన ‘మృగరాజు’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాల మధ్యలో ‘మనోహరం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో జగపతి బాబు ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటు ఉత్తమ చిత్రంగా నిలిచింది.ఈ చిత్రానికి గాను ఉత్తమ స్టోరీ రచయతగా గుణశేఖర్‌కు మరో నంది అవార్డు కూడా వచ్చింది.
ఇక మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘ఒక్కడు’ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వరుసగా మహేష్ బాబుతో ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు తెరకెక్కించాడు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను అందుకోలేదు.
ఒక్కడు మూవీలో సన్నివేశం (Twitter/Photo)
ఆ తర్వాత అల్లు అర్జున్‌తో తీసిన ‘వరుడు’ సినిమాతో పాటు రవితేజతో తీసిన ‘నిప్పు’సినిమాలు గుణశేఖర్‌కు తీవ్ర నిరాశకు గురిచేసాయి. 2015లో అనుష్క ప్రధాన పాత్రలో అల్లు అర్జున్, రానాలతో తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గుణశేఖర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా చివరన ‘ప్రతాప రుద్రుడు’ సినిమా తీస్తున్నట్టు చెప్పినా.. ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టారు. అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్‌తో ప్రతాప రుద్రుడు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రానా హీరోగా భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో‘హిరణ్యకశ్యప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగులో రెండు ‘భక్త ప్రహ్లాద’ సినిమాలు వచ్చాయి. అదే కాన్సెప్ట్‌తో హిరశ్యకశ్యప యాంగిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టారు.
రానాతో ‘హిరణ్యకశ్యప’ సినిమాను తెరకెక్కించనున్న గుణ శేఖర్ (Twitter/Photo)
ఇపుడు సమంతతో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి దర్శకుడిగా 30 ఏళ్ల కెరీర్లో మొత్తంగా డజను చిత్రాలు తెరకెక్కించారు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్లో ఇన్ని జానర్స్‌లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్‌కు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.