HBDAKodandaramiReddy: అదే దర్శకుడు కోదండరామిరెడ్డి స్పెషాలిటీ..

Happy Birthday Director A Kodandarami Reddy | తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులున్న అందులో ఏ.కోదండరామిరెడ్డిది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. చలన చిత్ర దర్శకుడిగా ఒక మూసకే పరిమితం కాకుండా.. అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో కోదండరామిరెడ్డి ఒకరు. ఈ రోజు ఈయన పుట్టినరోజు. 

news18-telugu
Updated: July 1, 2020, 11:23 AM IST
HBDAKodandaramiReddy: అదే దర్శకుడు కోదండరామిరెడ్డి స్పెషాలిటీ..
సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి (A Kodandarami Reddy)
  • Share this:
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులున్న అందులో ఏ.కోదండరామిరెడ్డిది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. చలన చిత్ర దర్శకుడిగా ఒక మూసకే పరిమితం కాకుండా.. అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో కోదండరామిరెడ్డి ఒకరు. ఈ రోజు ఈయన పుట్టినరోజు.  నెల్లూరు జిల్లాకు చెందిన కోదండరామిరెడ్డి  1 జూలై 1950లో జన్మించారు.  ముందుగా హీరో అవ్వాలని చెన్నైకి వెళ్లారు. అక్కడ తన బంధువు ప్రభాకర్ రెడ్డి ద్వరా ప్రముఖ దర్శకులు పి. చంద్రశేఖర్ రెడ్డితో పరిచయం అయింది. ఆయన సలహా మేరకు హీరో వేషాలకు స్వస్తి పలికి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. పి.చంద్రశేఖర్ రెడ్డి సలహాతో ప్రముఖ దర్శకులు వి.మధుసూదన రావు దగ్గర చాలా చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసారు. దాదాపు ఏడేళ్లు వి.మధుసూదన్ రావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసారు. ఆ తర్వాత కే.రాఘవేంద్రరావు దగ్గర ఒకటి రెండు చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడుముందుగా కోదండరామిరెడ్డికి కృష్ణ, రజినీకాంత్ హీరోలుగా తెరకెక్కిన ‘రామ్ రాబర్ట్ రహీమ్’ సినిమాతో డైరెక్ట్ కావల్సింది. కొత్త దర్శకుడితో రిస్క్ ఎందుకని అనుకున్నారో ఈ అవకాశం చేజారింది.

చిరు, బాలయ్య,వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వనీదత్ (File/Photo)
చిరు, బాలయ్య,వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వనీదత్ (File/Photo)


1970లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కోదండరామిరెడ్డి.. 19870లో ‘సంధ్య’ సినిమాతో దర్శకుడయ్యారు. ఈ చిత్రం హిందీలో హిట్టైయిన ‘తపస్య’ చిత్రానికి రీమేక్. ఆ తర్వాత చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘న్యాయం కావాలి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత కోదండరామిరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి టాప్ స్టార్ అయ్యారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు తెరకెక్కాయి. అందులో 80 శాతం చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. చిరుతో చివరగా ఈయన ‘ముఠామేస్త్రీ’ సినిమాను తెరకెక్కించాడు.

సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి (A Kodandarami Reddy)
సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి (A Kodandarami Reddy)


ముఖ్యంగా తెలుగు సినిమాలకు కమర్షియల్‌గా మరింత ఉన్నత శిఖరాలకు చేర్చారు కోదండరామిరెడ్డి.ఈయనకు బాలకృష్ణతో కూడా మంచి అనుబంధం వుంది. వీళ్ల కలయికలో మొత్తంగా 13 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు పక్సెస్ సాధించాయి. అనసూయమ్మ గారి అల్లుడు సినిమా నుంచి మొదలుపెడితే.. ‘యువరత్న రాణా’ వరకు వీళ్ల కాంబినేషన్‌లో చిత్రాలు వచ్చాయి.

Balakrishna Nandamuri director a kodandarami reddy successfull combination in tollywood film industry,బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో ఎన్ని హిట్స్ ఉన్నాయో తెలుసా..
బాలకృష్ణ,కోదండరామిరెడ్డి (File/Photos)


అటు నాగార్జున, వెంకటేష్‌తో  పాటు సీనియర్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మోహన్ బాబుతో పాటు కమల్ హాసన్‌తో  పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఇక ఎన్టీఆర్‌తో తప్పించి మిగిలిన అందరు అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించాడు. అన్నగారితో ఒకటి రెండు సార్లు సినిమా తెరకెక్కించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.
ఎన్టీఆర్ కోదండరామి రెడ్డి (sr ntr kodandarami reddy)
ఎన్టీఆర్ కోదండరామి రెడ్డి (sr ntr kodandarami reddy)


చివరగా ఈయన తన తనయుడు వైభవ్‌తో రెండు సినిమాలను నిర్మిస్తూ డైరెక్ట్ చేసాడు. కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో కోదండరామిరెడ్డి హిందీతో పాటు తమిళ, కన్నడలో ఒక్కో చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఏ సినిమాలను దర్శకత్వం వహించడం లేదు. ప్రస్తుత తరానితో పోటీ పడలేక వెనకబడ్డాడు. మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కోదండరామిరెడ్డిది ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి.
First published: July 1, 2020, 11:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading