హ్యాపీ బర్త్ డే మారుతి.. ఈ రోజుల్లో ఉండాల్సిన భలే భలే దర్శకుడు..

మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న చిన్న సినిమాకు ప్రాణం పోసింది ఈయనే. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 8, 2019, 3:37 PM IST
హ్యాపీ బర్త్ డే మారుతి.. ఈ రోజుల్లో ఉండాల్సిన భలే భలే దర్శకుడు..
దర్శకుడు మారుతి పుట్టినరోజు
  • Share this:
మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న చిన్న సినిమాకు ప్రాణం పోసింది ఈయనే. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు ఈయన. ఈ రోజుల్లో అంటూ చిన్న సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టాడు మారుతి. దానికి ముందు పోస్టర్ డిజైనింగ్స్, మల్టీమీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. ఈ రోజుల్లో సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత బస్టాప్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. అయితే బూతు సినిమాల దర్శకుడిగా విమర్శలు కూడా అందుకున్నాడు.
Happy Birthday to director Maruthi and Team Prathiroju Pandage celebrates his birthday pk మారుతి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న చిన్న సినిమాకు ప్రాణం పోసింది ఈయనే. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసాధ్యుడిగా మారిపోయాడు ఈయన. maruthi,director maruthi,director maruthi birthday,prathiroju pandage,maruthi prathiroju pandage movie,telugu cinema,మారుతి,మారుతి ప్రతిరోజూ పండగే,మారుతి సాయి ధరమ్ తేజ్,తెలుగు సినిమా,మారుతి బర్త్ డే
సాయి తేజ్ మారుతి


ఆ తర్వాత ప్రేమకథా చిత్రంతో అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మారుతి. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. భలేభలే మగాడివోయ్ సినిమాతో మారుతి రేంజ్ మారిపోయింది. నానిని కూడా ఈ సినిమాతో న్యాచురల్ స్టార్‌ చేసాడు మారుతి. ఆ వెంటనే వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం కాస్త దెబ్బతిన్నా కూడా మహానుభావుడు సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు.

నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు అంచనాలు తప్పినా కూడా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగ అంటూ వస్తున్నాడు మారుతి. అక్టోబర్ 8న ఈయన బర్త్ డే. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. సాయి సినిమా తర్వాత మహానుభావుడు సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న మారుతి.. మరిన్ని సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం.
First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading