Rajinikanth_Mano | సింగర్ మనో గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం సింగర్‌గానే కాదు.. ప్రస్తుతం ఈయన జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంతో పలు సంగీత సంబంధ ప్రోగ్రామ్‌లకు కూడా జడ్జ్‌గా వ్యవహరించారు. అంతేకాదు.. ఈయన నటుడుతో పాటు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ముఖ్యంగా రజినీకాంత్‌కు మనో చెప్పే డబ్బింగ్ అతికినట్టు సరిపోతుంది. నిజంగా రజినీకాంత్ ఒరిజినల్‌గా మాట్లాడినట్టే ఉంటుంది. అంతలా మనో డబ్బింగ్ రజినీకాంత్‌కు అతికినట్టు సరిపోయింది.ఇక రజినీకాంత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా రజినీ స్టైల్, డైలాగ్ డెలవరి ప్రేక్షకులకు ఎంతోగానో ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా సింగర్ మనో.. రజినీకాంత్‌కు డబ్బింగ్ చెప్పే వరకు సాయి కుమార్ మాత్రమే రజినీకి డబ్బింగ్ చెప్పేవారు. కేవలం రజినీకాంత్ కాదు.. దాదాపు తెలుగు డబ్ అయ్యే అన్ని భాషల హీరోల చిత్రాలకు సాయి కుమారే డబ్బింగ్ చెప్పేవారు. హీరో అయ్యాక.. మాత్రం వేరే హీరోలకు డబ్బింగ్ చెప్పడం ఆపేశాడు.
ఐతే.. సాయి కుమార్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసే సమయంలో రజినీకాంత్‌కు డబ్బింగ్ చెప్పిన ‘భాషా’ ఏ లెవల్లో హిట్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగులో భాషా ఒక్కసారి చెబితే.. వంద సార్లు చెప్పినట్టు అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.
భాషా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ తెలుగులో నటించిన స్ట్రెయిట్ చిత్రం ‘పెదరాయుడు’ సినిమాకు కూడా సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత రజినీకాంత్.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘ముత్తు’ సినిమా చేసారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కోసం ముందుగా సాయి కుమార్‌ను సంప్రదించారు. అప్పటికే సాయి కుమార్.. హీరోగా బిజీగా మారటంతో టైమ్ కుదరలేదు. అదే సమయంలో ముత్తు సినిమాలో ముసలి రజినీకాంత్ పాత్ర రెండు సీన్లకు మాత్రమే మనో తొలిసారి డబ్బింగ్ చెప్పారు.
అది విని రజినీకాంత్ ఆఫీస్ నుంచి మనోకు ఫోన్ వచ్చిందట. ఈ సినిమా కోసం సాయి కుమార్ బిజీగా ఉన్నారు. కాబట్టి మొత్తం సినిమాకు మీరే డబ్బింగ్ చెప్పండి అంటూ రజినీకాంత్ మనోకు ఫోన్ చేసారు. అప్పటి నుంచి రజినీకాంత్ ప్రతి చిత్రానికి మనోనే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. మధ్యలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమాకు మాత్రం దివంగత ఎప్పీ బాలుగారు డబ్బింగ్ చెప్పారు. ఇక శివాజీలో రజినీకి మనో తెలుగులో చెప్పిన డబ్బింగ్‌కు రజినీకాంత్ స్పెషల్‌గా అభినందించారట. మొత్తంగా ఇపుడు తెలుగులో రజినీకాంత్ సినిమా అంటే మనో డబ్బింగ్ ఉండాల్సిందే అనేంతగా ప్రేక్షకులకు తన గాత్రంతో చేరువ అయ్యారు మనో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Rajinikanth, Singer Mano, Tollywood