హోమ్ /వార్తలు /సినిమా /

HBD Rajinikanth: చిరంజీవి, మహేష్ బాబు సహా రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన సెలబ్రిటీలు..

HBD Rajinikanth: చిరంజీవి, మహేష్ బాబు సహా రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన సెలబ్రిటీలు..

రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి, మహేష్ బాబు తదితరులు (Twitter/Photo)

రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి, మహేష్ బాబు తదితరులు (Twitter/Photo)

Happy Birthday Rajinikanth-Chiranjeevi-Mahesh Babu |  ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, మోహన్ లాల్ సహా పలువురు ప్రముఖలు రజినీకాంత్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఇంకా చదవండి ...

Happy Birthday Rajinikanth-Chiranjeevi-Mahesh Babu |  ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. మీరు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలంటూ ప్రధాని ట్వీట్ చేసారు.పీఎంతో పాటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు రజినీకాంత్ బెస్ట్ విషెస్ తెలియజేసారు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. తలైవాకు తనదైన శైలిలో బెస్ట్ విషెస్ తెలియజేస్తూ.. రాజకీయాల్లో మీరు విజయం సాధించాలి అంటూ ట్వీట్ చేసారు. మీదైన ప్రత్యేకమైన స్టైల్‌తో కొన్ని లక్షల మందికి గుండెలను కొల్లగొట్టారు. అలాగే రాజకీయం అనే ప్రజా సేవలో కూడా మీరు ప్రత్యేకత చాటాలని ఆశిస్తున్నాను.


అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మీరు మా లాంటి ఎంతో మందికి స్పూర్తి. మీరు ఆయు ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను.


సీనియర్  హీరో వెంకటేష్ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బెస్ట్ తెలియజేసారు. ముందు ముందు మీకు మంచి భవిష్యత్తు ఉండాలన్నారు.


మరోవైపు మాస్ మహారాజ్.. రవితేజ కూడా తలైవాకు బర్త్ డే విషెష్ తెలియజేసరు. రవితేజతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి రజినీకాంత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
రజినీకాంత్ విషయానికొస్తే..  ఈయన ఈ నెల 31న నూతన సంవత్సర  కానుకగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తమిళనాడులో ద్రవిడ నాస్తిక రాజకీయాలు కాకుండా... తన పార్టీతో ఆధ్యాత్మిక రాజకీయాలకు కొత్త పునాది వేస్తున్నట్టు ప్రకటించారు.

First published:

Tags: Chiranjeevi, Kollywood, Mahesh babu, Mohan Lal, Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు