HBD Sumanth: తాత ఏఎన్నాఆర్.. మామ నాగార్జునతో నటించడమే సుమంత్ చేసిన అతి పెద్ద తప్పట..

తాత ఏఎన్నార్‌,మేనమామ నాగార్జునలతో సుమంత్ (File/Photo)

ANR Nagarjuna Sumanth | అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు సుమంత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలోసుమంత్ మాట్లాడుతూ.. తన తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో చేసిన సినిమాలు చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    HBD Sumanth | అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు హీరో సుమంత్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరో అయ్యారు. మధ్యలో హీరోగా కొన్ని ఫ్లాపులు రావడంతో అనుకున్నంత రేంజ్‌లో  హీరోగా మెప్పించలేకపోయాడు.  అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. తన తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో సినిమాలు చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే.. తాను చిన మేనమామ నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేయడం తన సినీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకున్నారు.2001లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అవుంతుందని .. తనకు ముందే తెలుసన్నారు.

    ఈ  సినిమా చేయడం కరెక్ట్ కాదని షూటింగ్ సమయంలోనే అనిపించింది. కానీ అప్పటికే సగం షూటింగ్ అయిపోయింది. దీంతో ఏమి చేయలేకపోయాను. ఈ సినిమాలో  నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాల్లో స్నేహితులుగా నటించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదన్నారు. అంతేకాదు తెలుగులో ఈ స్క్రిప్ట్ అంతగా గొప్పగా వర్కౌట్ కాలేదన్నారు.

    hero sumanth sensational comments about his act with anr and uncle nagarjuna,sumanth,sumanth anr nagarjuna,akkineni nageshwara rao nagarjuna, sumanth,sumanth yarlagadda,sumanth sensational comments anr and nagarjuna,sumanth sensational comments on his grand father anr,sumanth sensational comments on nagarjuna akkineni,tollywood,telugu cinema,nagarjuna twitter,sumanth interview,sumanth youtube,సుమంత్,సుమంత్ యార్లగడ్డ,అక్కినేని నాగేశ్వర రావు,నాగార్జున అక్కినేని,సుమంత్ సెన్సేషనల్ కామెంట్స్ నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్నార్ నాగార్జున సుమంత్,సుమంత్ యార్లగడ్డ
    స్నేహమంటే ఇదేరాలో నాగార్జున, సుమంత్ (File/Photo)


    ‘ప్నేహమంటే ఇదేరా’ సినిమా మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఆ తర్వాత  తమిళంలో సూర్య, విజయ్ హీరోలుగా మలయాళ వెర్షన్‌ డైరెక్ట్ చేసిన సిద్దిక్ అదే ‘ఫ్రెండ్స్’ టైటిల్‌తో రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టైంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో స్నేహితులుగా మా బంధాన్ని ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు.  ఆ విషయం తనకు షూటింగ్ చేస్తున్న సమయంలో అర్ధమైంది. కానీ బయటకు మాత్రం చెప్పలేకపోయాను. ఇక మావయ్య నాగార్జునతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానన్నారు.ఈ సినిమాలో అల్లుడైన నేను నాకు మేనమామ అయిన నాగార్జునను కొట్టేసీన్ ఉంటుంది. ఆ సన్నివేశం తీసేటపుడు నేను ఎంతో బాధపడ్డాను. ప్రేక్షకులు కూడా ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారని చెప్పుకొచ్చారు.అందుకే ఈ సినిమా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తాను.

    hero sumanth sensational comments about his act with anr and uncle nagarjuna,sumanth,sumanth anr nagarjuna,akkineni nageshwara rao nagarjuna, sumanth,sumanth yarlagadda,sumanth sensational comments anr and nagarjuna,sumanth sensational comments on his grand father anr,sumanth sensational comments on nagarjuna akkineni,tollywood,telugu cinema,nagarjuna twitter,sumanth interview,sumanth youtube,సుమంత్,సుమంత్ యార్లగడ్డ,అక్కినేని నాగేశ్వర రావు,నాగార్జున అక్కినేని,సుమంత్ సెన్సేషనల్ కామెంట్స్ నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్నార్ నాగార్జున సుమంత్,సుమంత్ యార్లగడ్డ
    ’పెళ్లి సంబంధం’ సినిమాలో తాత అక్కినేనితో సుమంత్ (Facebook/Photo)


    ఒక్క మేనమామ నాగార్జునతో కాదు..తాతయ్య నాగేశ్వరరావుతో ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశానన్నారు. రాఘవేంద్రరావు బలవంతం చేయడంతో ఈ సినిమా చేసానన్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిందని సుమంత్ చెప్పుకొచ్చారు. తాతయ్య, మామయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆరాటంతో నేను చేసిన సినిమాలు ఇవి. ఈ ఫిల్మ్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌లు సరిగా లేకపోవడంతో పాటు.. మా అనుబంధం కారణంగా ఈ సినిమాలు నడవలేదని సుమంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సుమంత్.. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో తాత ఏఎన్నార్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. త్వరలోనే ‘కపటధారి’తో పాటు ‘అనగనగా ఒక రౌడీ’ సినిమాతో పలకరించబోతున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: