• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HAPPY BIRTHDAY STYLISH DIRECTOR MEHER RAMESH THESE ARE THE QUALITIES OF DIRECTOR MEHER RAMESH TA

HBD Meher Ramesh: దర్శకుడిగా మెహర్ రమేష్ స్పెషాలిటీ అదే..

HBD Meher Ramesh: దర్శకుడిగా మెహర్ రమేష్ స్పెషాలిటీ అదే..

దర్శకుడు మెహర్ రమేష్ పుట్టినరోజు (Twitter/Photo)

Happy Birthday Meher Ramesh | మెహర్ రమేష్ టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’ సినిమాలో హీరోకు అసిస్టెంట్‌గా నటించాడు.

  • Share this:
    HBD Meher Ramesh | మెహర్ రమేష్ టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’ సినిమాలో హీరోకు అసిస్టెంట్‌గా నటించాడు. ఈయన 6 నవంబర్ 1976లో విజయవాడలో జన్మించారు. ఈయన చిరంజీవిక దగ్గరకు బంధువు.  ఆ సంగతి పక్కన పెడితే.. ఈయన  పూరీ జగన్నాథ్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘ఆంధ్రావాలా’ సినిమాను.. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఒకేసారి తెరకెక్కించాడు. ఇక తెలుగులో అప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి’ సినిమాతో ఇండస్ట్రీ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్న వయసులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంతో పాటు మరికొన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.  తెలుగులో సరిగా నడవని ‘ఆంధ్రావాలా’  సినిమాను  కన్నడలో ‘వీర కన్నడిగ’గా మెహర్ రమేష్ తెరకెక్కిస్తే.. అక్కడ  మాత్రం సూపర్ హిట్టైయింది.  తన గురువు పూరీ జగన్నాథ్ కథతో మెహర్ రమేష్  హిట్ అందుకుంటే.. పూరీ జగన్నాథ్ మాత్రం ఫ్లాప్ అందుకున్నాడు.

    Happy Birthday Stylish Director Meher Ramesh These are the qualities of director meher ramesh,Meher Ramesh,HBDMeherRamesh,Happy Birthday Meher Ramesh,Meher Ramesh Movies,Meher Ramesh Chiranjeevi Remake,Meher Ramesh NTR,Meher Ramesh Prabhas,Meher Ramesh venakatesh,tollywood,Telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ సినిమాలు,హ్యాపీ బర్త్ డే మెహర్ రమేష్,మెహర్ రమేష్ సినిమాలు,మెహర్ రమేష్ ఎన్టీఆర్,మెహర్ రమేష్ శక్తి బిల్లా షాడో కంత్రి,మెహర్ రమేష్ చిరంజీవి,మెహర్ రమేష్ చిరంజీవి వేదాలం రీమేక్
    ఎన్టీఆర్,మెహర్ రమేష్ (File/Photo)


    ఆ సంగతి పక్కన పెడితే.. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్టైన ‘ఒక్కడు’ సినిమాను కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో ‘అజయ్’ పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. తెలుగులో ఈయన మొదటి చిత్రం ‘కంత్రి’. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. ఈ సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కించడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా మొత్తాన్నిమెహర్ రమేష్ తన గురువు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ మాదిరి తెరకెక్కించడానే విమర్శలు ఎదుర్కొన్నాడు.  తర్వాత హిందీ  ‘డాన్’ మూవీ తెలుగు రీమేక్ ను ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ పేరుతో రీమేర్ చేసాడు. ఈ చిత్రంలో సన్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయనే పేరు వచ్చింది తప్ప.. మెహర్ రమేష్‌కు  సక్సెస్ మాత్రం రాలేదు.

    బిల్లా సినిమా ప్రభాస్ (Twitter/Photo)


    ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ హీరోగా ‘శక్తి’ అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం అందరి అంచనాలు తలకిందలు చేస్తూ.. అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ‘షాడో’ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆ  సినిమా ఫ్లాప్ తర్వాత కొన్ని యాడ్స్ చేసుకుంటూ కాలం వెళ్లతీస్తున్నాడు. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన యాడ్ షూట్స్ మొత్తం మెహర్ రమేష్ కన్నుసన్నల్లో తెరకెక్కడం విశేషం.

    Superstar Mahesh Babu giving a bumper offer to director Meher Ramesh with Namrata recommendation pk హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. meher ramesh,meher ramesh mahesh babu,meher ramesh sarileru neekevvaru,meher ramesh distributor,meher ramesh sarileru neekevvaru guntur rights,meher ramesh namrata friendship,meher ramesh twitter,meher ramesh mahesh babu,namrata shirodkar twitter,meher ramesh movies,meher ramesh namrata shirodkar,meher ramesh web series,meher ramesh namrata shirodkar web series,meher ramesh instagram,meher ramesh mahesh babu movies,meher ramesh bobby,meher ramesh jagapathi babu,telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ డిస్ట్రిబ్యూటర్,మెహర్ రమేష్ గుంటూర్ రైట్స్ సరిలేరు నీకెవ్వరు,మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్,మెహర్ రమేష్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,మెహర్ రమేష్ మహేష్ బాబు
    మెహర్ రమేష్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్


    ఇపుడు దాదాపు ఏడేళ్ల తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ముందుగా పవన్ కళ్యాణ్‌తో నీసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇపుడు అదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేసే బాధ్యతలు దక్కించుకున్నాడు మెహర్ రమేష్. ఇక చిరంజీవి.. ఆచార్య తర్వాత చేయబోయేది మెహర్ రమేష్ దర్శకత్వంలోనే అనే టాక్ వినబడుతోంది.

    చిరంజీవి, మెహర్ రమేష్ (Chiranjeevi meher ramesh/Photo)
    చిరంజీవి, మెహర్ రమేష్ (Chiranjeevi meher ramesh/Photo)


    ఈ సినిమా సక్సెస్ సాధిస్తే.. మహేష్ బాబు.. మెహర్ రమేష్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అంటూ చెప్పాడట. మొత్తానికి దాదాపు ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న మెహర్ రమేష్.. చిరుతో చేయబోయే చిత్రంతో సక్సెస్ అందుకోవాలని కోరుకంటూ.. అతనికి మరోసారి బర్త్ డే విషెష్ తెలియజేద్దాం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: