Happy Birthday Shruti Haasan | సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. కానీ చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవ్వడంతో ఐరన్ లెగ్ గా విమర్శలు ఎదురుకుంది. అయినా వెనుతిరగలేదు...టాలెంట్ ను, నటనను నమ్ముకుని సక్సెస్ కోసం ఓపిగ్గా ఎదురుచూసింది...ఇప్పుడు సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి...టాలెంటెడ్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్న ఆమె ఇంకేవరో కాదు..లెజండ్ హీరో కమల్ హసన్ కూతురుగా సినీ ఆరంగేట్రం చేసిన శృతి హసన్,ఈ రోజు తనబర్త్ డే సందర్భంగా స్పెషల్..
కమల్ హసన్ కూతురుగా తెరంగేట్రం చేసినా తన ఫర్ఫామెన్స్ తో, వ్యక్తిత్వంతో అకట్టుకుంటూ చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది శృతి హసన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా అందచందాలు ప్రదర్శిస్తూ మరోపక్క తండ్రి కమల్ హసన్ లా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేసి మెప్పిస్తోంది.
శృతి హసన్ 1986 జనవరి 28న జన్మించింది. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత లక్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2009 లో వచ్చిన ఈ మూవీ తో శృతి హాసన్ కి అన్ లక్కీనే ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది..ఈ సినిమాలో శృతి హసన్ డ్యూయల్ రోల్ కూడా చేసింది. అదేదీ సినిమాను నిలబెట్టలేకపోయింది. ఆ తర్వాత మరో హిందీ మూవీ ‘దిల్ తో బచ్చా హై’ లో చేసినా ఈ సినిమా కూడా శృతి కెరీర్‌కు ఏ విధంగాను ఉపయోగ పడలేదు. 2009లో కమల్ హాసన్, వెంకటేష్ చిత్రం ‘ఈనాడు’ సినిమాకు మ్యూజిక్ అందించింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ‘ఉన్నపోల్ ఒరువన్’ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం. ఆ తర్వాత పలువురు సంగీత దర్శకులు చిత్రాలకు తనవంతు సంగీత సహకారం అందిచింది శృతి హాసన్.
శృతి హసన్ ఒక్క బాలీవుడ్‌నే నమ్ముకోకుండా తండ్రిలా బాలీవుడ్ తో పాటు తెలుగు ,తమిళ్ బాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిద్దార్థకు జోడి గా అనగనగా ఓ ధీరుడు,తమిళ్ లో సూర్య హీరోగా నటించి తెలుగు లోకి డబ్బింగ్ అయిన 7TH సెన్స్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు ఫీల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డులు కూడా అందుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రాలు అంతగా అడలేదు..ఆ తర్వాత సిద్ధార్థ, హన్సిక, శృతి హసన్ కలిసి నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ రిలీజైంది...అమ్మాయి,అబ్బాయిల మధ్య ఉండే స్నేహ బంధాన్ని చక్కగా చూపించిన ఈ మూవీ కూడ శృతి హసన్ ను నిరాశనే మిగిల్చింది.
ప్లాప్ లు వెంటడుతున్నా శృతి హసన్ కు కలిసి వచ్చిన సంవత్సరం 2012...ఈ ఇయర్ లో శృతి ధనుష్ తో కలిసి నటించిన త్రీ, పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ మూవీలు రిలీజయ్యాయి...త్రీ మూవీతో ఫర్పామేన్స్ ఉన్న ఆర్టిస్టుగా గుర్తుంపు తెచ్చుకుంటే, గబ్బర్ సింగ్ మూవీ బాక్సపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి శృతి హాసన్‌కు ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ ను అందించింది. దీంతో శృతి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది.
ఆ తర్వాత ‘డి డే’, ‘రామయ్య వస్తావయ్యా’ అనే రెండు బాలీవుడ్ సినిమాలు ఒకే రోజు రిలీజై శృతి హసన్ కి ఆర్టిస్ట్ గా మంచి పేరు తీసుకోచ్చాయి .బాక్స్ ఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి..డి డే సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా IIFA అవార్డుకు నామినేట్ అయ్యింది శృతి.ఆ తర్వాత రామ్ చరణ్ తో తెలుగులో వచ్చిన ‘ఎవడు’ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన అందాలను ప్రదర్శించి కుర్రకారు ప్రేక్షకుల మతులు పోగొట్టింది శృతి.
2014 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసిన నటించిన ‘రేసు గుర్రం’ సినిమా శృతి హసన్ కి బ్లాక్ బాస్టర్ తో పాటు నటి గా గుర్తుంపును, అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో స్పందన పేరుగల అమ్మాయిగా నటించింది.. కాని పేరుకు విరుద్దంగా ఎలాంటి స్పందన ప్రదర్శించకుండా అన్నిటికీ లోపలే స్పందించే పాత్రలో అద్బుతంగా నటించింది.ఈ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్‌గా, ఫిల్మ్ ఫేర్ ,SIIMA అవార్డులను సోంతం చేసుకుంది.
ఆ తర్వాత శృతి హసన్ తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది..తమిళ్ లో ఫూజై, పులి ,వేదాళం లాంటి సినిమాలు చేస్తే,హిందీ లో గబ్బర్ ఈజ్ బ్యాక్, వెల్ కమ్ బ్యాక్ ,రాకీ హ్యండ్ సమ్ లాంటి సినిమాలలో నటించింది..హీరోయిన్ గా బిజీగా ఉంటూనే ఐటం సాంగ్ లలో కూడా నర్తించింది శృతి హసన్...స్వతహాగా మంచి డాన్సర్ ఐనా శృతి మహేష్ బాబు హీరో గా వచ్చిన ఆగడు సినిమాతో పాటు బాలీవుడ్ లో వచ్చిన తేవర్ (TEVAR) మూవీ లలో స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగుంచింది.
2015 లో మహేష్ బాబుతో జోడిగా వచ్చిన శ్రీమంతుడు మూవీ ఇమే కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది...తెలుగులో సూపర్ హిట్ ను నమోదు చేసిన ఈ చిత్రంలో శృతి నటిగా ఫర్ఫామెన్స్ ప్రదర్శిస్తూనే డ్యూయెట్ లలో కుర్రకారులను అలరించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ’ప్రేమమ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. కాటమ రాయుడు’ సినిమాలో నటించింది. అటు సూర్యతో ‘S3’లో కూడా మెరిసింది. మరోవైపు ‘శభాష్ నాయుడు’లో నటించేందకు ఛాన్స్ వచ్చినా.. ఈ సినిమా సందర్భంగా కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురి కావడంతో ఈ సినిమా ప్రస్తుతానికి నిలిచిపోయింది.
భవిష్యత్తులో ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయి. ఈ సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. 2021లో రవితేజ ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.
త్వరలో పవన్ కళ్యాణ్ సరసన ‘వకీల్ సాబ్’ సరసన కనిపించనుంది. అంతేకాదు ప్రభాస్ సరసన ‘సలార్’మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మొత్తంగా శృతి హాసన్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.