Home /News /movies /

HAPPY BIRTHDAY SHRUTI HAASAN DO YOU KNOW FACTS ABOUT SHRUTI HAASAN HOW CAN SHE BECOME STAR KID TO STAR HEROINE HERE ARE THE DETAILS TA

HBD Shruti Haasan: ఈ జనరేషన్‌లో ఆ రెండు రికార్డ్స్ ఉన్న ఏకైక భారతీయ హీరోయిన్ ‘శృతి హాసన్’ మాత్రమే..

శృతి హాసన్ (Shruti haasan photo : Instagram)

శృతి హాసన్ (Shruti haasan photo : Instagram)

Happy Birthday Shruti Haasan | సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్ ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇంకా చదవండి ...
Happy Birthday Shruti Haasan | సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా యూనివర్సల్ హీరో కమల్ హాసన్    కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. కానీ చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవ్వడంతో ఐరన్ లెగ్ గా విమర్శలు ఎదుర్కొంది. అయినా వెనుతిరగలేదు...టాలెంట్ ను, నటనను నమ్ముకుని సక్సెస్ కోసం ఓపిగ్గా ఎదురుచూసింది...ఇప్పుడు సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి...టాలెంటెడ్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకుంది శృతి హాసన్. లెజండరీ హీరో కమల్ హసన్ కూతురుగా సినీ ఆరంగేట్రం చేసిన శృతి హసన్ ఈ  రోజు తనబర్త్ డే తన 36వ బర్త్ డే జరుపుకుంటోంది.

కమల్ హసన్ కూతురుగా తెరంగేట్రం చేసినా తన ఫర్ఫామెన్స్ తో, వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటూ చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది శృతి హసన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా అందచందాలు ప్రదర్శిస్తూ మరోపక్క తండ్రి కమల్ హసన్‌లా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేసి మెప్పిస్తోంది.

శృతి హాసన్ (Instagram/Photo)


శృతి హసన్ 1986 జనవరి 28న జన్మించింది. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత లక్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

శ్రుతీ హాసన్  Photo: Shruti Haasan Instagram


2009 లో వచ్చిన ఈ మూవీ తో శృతి హాసన్ కి అన్ లక్కీనే ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది..ఈ సినిమాలో శృతి హసన్ డ్యూయల్ రోల్ కూడా చేసింది. అదేదీ సినిమాను నిలబెట్టలేకపోయింది. ఆ తర్వాత మరో హిందీ మూవీ ‘దిల్ తో బచ్చా హై’ లో చేసినా ఈ సినిమా కూడా శృతి కెరీర్‌కు ఏ విధంగాను ఉపయోగ పడలేదు.

Ram Charan : అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదు..

2009లో కమల్ హాసన్, వెంకటేష్ చిత్రం ‘ఈనాడు’ సినిమాకు మ్యూజిక్ అందించింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ‘ఉన్నపోల్ ఒరువన్’ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం.  ఆ తర్వాత పలువురు సంగీత దర్శకులు చిత్రాలకు తనవంతు సంగీత సహకారం అందిచింది శృతి హాసన్.

వెంకటేష్, కమల్ హాసన్ ‘ఈనాడు’చిత్రానికి శృతి హాసన్ సంగీతం (Twitter/Photo)


శృతి హసన్ ఒక్క బాలీవుడ్‌నే నమ్ముకోకుండా తండ్రిలా బాలీవుడ్‌తో  పాటు తెలుగు ,తమిళ్ బాషల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిద్దార్థకు జోడి గా ‘అనగనగా ఓ ధీరుడు’,తమిళ్ లో సూర్య హీరోగా నటించి తెలుగు లోకి డబ్బింగ్ అయిన ‘7TH సెన్స్’ మూవీ‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు ఫీల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డులు కూడా అందుకుంది.

RRR : ఆ హీరో ఎఫెక్ట్ .. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలయ్యేది ఆరోజే..

కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రాలు అంతగా అడలేదు..ఆ తర్వాత సిద్ధార్థ, హన్సిక, శృతి హసన్ కలిసి నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ రిలీజైంది...అమ్మాయి,అబ్బాయిల మధ్య ఉండే స్నేహ బంధాన్ని చక్కగా చూపించిన ఈ మూవీ కూడ శృతి హసన్ ను నిరాశనే మిగిల్చింది.

Kamal Haasan makes interesting comments about His daughter Shruti Haasan marriage శృతీహసన్ పెళ్లి గురించి కమల్ హాసన్ సంచలన కామెంట్స్.. వేరే కులస్థుడిని పెళ్లి చేసుకుంటే..
కమల్ హాసన్, శృతి హాసన్ (File/Photos)


ప్లాప్ లు వెంటడుతున్నా శృతి హసన్ కు కలిసి వచ్చిన సంవత్సరం 2012...ఈ ఇయర్ లో శృతి ధనుష్ తో కలిసి నటించిన త్రీ, పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ మూవీలు రిలీజయ్యాయి...త్రీ మూవీతో పర్ఫామెన్స్ ఉన్న ఆర్టిస్టుగా గుర్తుంపు తెచ్చుకుంటే, ‘గబ్బర్ సింగ్’ మూవీ బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి శృతి హాసన్‌కు ఫస్ట్  కమర్షియల్ సక్సెస్‌ను అందించింది. దీంతో శృతి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాతో శృతి హాసన్ ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్‌గా మారింది. ఈ సినిమాతోనే ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ అందుకున్నారు.

vakeel saab movie,pawan kalyan vakeel saab,vakeel saab movie updates,vakeel saab first look,vakeel saab updates,vakeel saab movie teaser,vakeel saab movie heroine,shruti haasan,pawan kalyan vakeel saab movie updates,vakeel saab movie shruti hassan,nivetha thomas about vakeel saab movie,shruti hassan role in vakeel saab movie,shruti hassan,pawan kalyan vakeel saab movie,vakeel saab movie heroine name,వకీల్ సాబ్,శృతి హాసన్ వకీల్ సాబ్ సినిమా,పవన్ కళ్యాణ్ శృతి హాసన్,శృతి హాసన్ రవితేజ క్రాక్
గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ Photo : Twitter


ఆ తర్వాత ‘డి డే’, ‘రామయ్య వస్తావయ్యా’ అనే రెండు బాలీవుడ్ సినిమాలు ఒకే రోజు రిలీజై శృతి హసన్ కి ఆర్టిస్ట్ గా మంచి పేరు తీసుకోచ్చాయి.బాక్సా ఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి..డి డే సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా IIFA అవార్డుకు నామినేట్ అయ్యింది శృతి. హిందీలో ‘రామయ్య వస్తావయ్యా’తో పాటు తెలుగులో ఎన్టీఆర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’ టైటిల్‌తో సినిమాలు చేయడం విశేషం. ఒక రోజు రెండు సినిమాలు రిలీజైన హీరోయిన్‌గా.. ఒక టైటిల్‌తో రెండు విభిన్న భాషల్లో సినిమా చేసిన కథానాయికగా శృతి హాసన్ రికార్డులకు ఎక్కింది.

తనకి 'బలుపు' .. 'క్రాక్' వంటి భారీ హిట్లు ఇవ్వడం వల్లనే ఆమె ఈ సినిమాకి అంగీకరించిందని టాక్. అయితే శృతి హాసన్ ఈ సినిమాలో నటించాడనికి చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదు అనేది వాటిలో ఒకటి అని అంటునట్నారు. అన్నిటికీ అంగీకరించే గోపీచంద్ ఓకే అనేశాడట. ఇక ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది.
‘రామయ్య వస్తావయ్య’ టైటిల్‌తో రెండు సినిమాల్లో నటించిన శృతి హాసన్ (File/Photo)


ఈ రకంగా ఒక రోజు రెండు సినిమాలు.. రెండు టైటిల్స్‌తో సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ శృతి హాసన్ కావడం గమనార్హం.   ఆ తర్వాత రామ్ చరణ్ తో తెలుగులో వచ్చిన ‘ఎవడు’ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన అందాలను ప్రదర్శించి కుర్రకారు ప్రేక్షకుల మతులు పోగొట్టింది శృతి.

ఎవడు మూవీలో రామ్ చరణ్, శృతి హాసన్ (Twitter/Photo)


2014 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసిన నటించిన ‘రేసు గుర్రం’ సినిమా శృతి హసన్ కి బ్లాక్ బాస్టర్ తో పాటు నటిగా గుర్తుంపును, అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో స్పందన పేరుగల అమ్మాయిగా నటించింది.. కాని పేరుకు విరుద్దంగా ఎలాంటి స్పందన ప్రదర్శించకుండా అన్నిటికీ లోపలే స్పందించే పాత్రలో అద్బుతంగా నటించింది. ఈ సినిమాలోని నటనకు బెస్ట్ యాక్ట్రెస్‌గా, ఫిల్మ్ ఫేర్ ,SIIMA అవార్డులను సోంతం చేసుకుంది.

‘రేసు గుర్రం’లో అల్లు అర్జున్, శృతి హాసన్ (Twitter/Photo)


ఆ తర్వాత శృతి హసన్ తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది..తమిళ్ లో ఫూజై, పులి ,వేదాళం లాంటి సినిమాలు చేస్తే,హిందీ లో గబ్బర్ ఈజ్ బ్యాక్, వెల్ కమ్ బ్యాక్ ,రాకీ హ్యండ్ సమ్ లాంటి సినిమాలలో నటించింది..హీరోయిన్ గా బిజీగా ఉంటూనే ఐటం సాంగ్ లలో కూడా నర్తించింది శృతి హసన్...స్వతహాగా మంచి డాన్సర్ ఐనా శృతి మహేష్ బాబు హీరో గా వచ్చిన ‘ఆగడు’ సినిమాతో పాటు బాలీవుడ్ లో వచ్చిన తేవర్ (TEVAR) మూవీ లలో స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగుంచింది.

*శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబు,శృతి హాసన్ (Twitter/Photo)


2015 లో మహేష్ బాబుతో జోడిగా వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీ ఈమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది...తెలుగులో సూపర్ హిట్ ను నమోదు చేసిన ఈ చిత్రంలో శృతి నటిగా పర్ఫామెన్స్ ప్రదర్శిస్తూనే డ్యూయెట్ లలో కుర్రకారులను అలరించింది. ఆ తర్వాత నాగచైతన్యతో ’ప్రేమమ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. కాటమ రాయుడు’ సినిమాలో నటించింది. అటు సూర్యతో ‘S3’లో కూడా మెరిసింది. మరోవైపు ‘శభాష్ నాయుడు’లో నటించేందకు ఛాన్స్ వచ్చినా.. ఈ సినిమా సందర్భంగా కమల్ హాసన్ యాక్సిడెంట్‌కు గురి కావడంతో ఈ సినిమా ఆగిపోయింది.

క్రాక్ మూవీలో శృతి హాసన్ (Twitter/Photo)


భవిష్యత్తులో ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయి.  ఈ సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న శృతి హాసన్..  2021లో రవితేజ ‘క్రాక్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో అలరించింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కతోన్న  ‘సలార్’ చిత్రంలో ఆద్య పాత్రలో నటిస్తోంది.

‘సలార్’ మూవీలో ఆద్యగా శృతి హాసన్ (Twitter/Photo)


తాజాగా ఈమె బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది. ఓ వైపు ప్రభాస్ వంటి యువ హీరోల సరసన చేస్తూ మరో వైపు బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ పక్కన ఆడిపాడటానికి అంగీకరించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తనకి 'బలుపు' .. 'క్రాక్' వంటి భారీ హిట్లు ఇవ్వడం వల్లనే ఆమె ఈ సినిమాకి అంగీకరించిందని టాక్. అయితే శృతి హాసన్ ఈ సినిమాలో నటించాడనికి చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదు అనేది వాటిలో ఒకటి అని అంటున్నారు.

బాలకృష్ణ సరసన శృతిహాసన్, (Twitter/Photo)


అన్నిటికీ అంగీకరించే గోపీచంద్ ఓకే అనేశాడట. ఇక ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. మరోవైపు చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో ఈ కండిషన్స్ కారణంగా ఓకే చేసినట్టు టాక్.  మొత్తంగా శృతి హాసన్ ఓ వైపు యువ హీరోలతో పాటు మరోవైపు సీనియర్ హీరోలతో ఆడిపాడుతోంది. మొత్తంగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటోన్న శృతికి న్యూస్ 18 స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Kollywood, NBK 107, Shruti haasan, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు