Home /News /movies /

HAPPY BIRTHDAY SHRUTI HAASAN BALAKRISHNA NBK 107 MYTHRI MOVIE MAKERS SPECIAL BIRTHDAY WISHES TO SHRUTI HAASAN TA

Shruti Haasan : శృతి హాసన్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసిన బాలయ్య NBK 107 చిత్ర యూనిట్..

శృతి హాసన్‌కు NBK 107 స్పెషల్ బర్త్ డే విషెస్ (Twitter/Photo)

శృతి హాసన్‌కు NBK 107 స్పెషల్ బర్త్ డే విషెస్ (Twitter/Photo)

Balakrishna - Shruti Haasan - Gopichanda Malineni : సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రవితేజ‌తో ’క్రాక్’.. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ మూవీలతో పలకరించింది. ఈ రోజు శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా NBK 107 యూనిట్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇంకా చదవండి ...
    Balakrishna - Shruti Haasan - Gopichanda Malineni : సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రవితేజ‌తో ’క్రాక్’.. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ మూవీలతో పలకరించింది. తాజాగా ఈమె ప్రభాస్ ‘సలార్’ తో పాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తోంది. ఈ రోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్.. NBK 107 చిత్ర యూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలియజేసింది. గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా విడుదలై   50 రోజులు పూర్తి చేసుకుని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది.

    పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో  పటా పంచలైపోయాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.  ఇక రూ. 80 కోట్ల షేర్‌తో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. అఖండ’ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

    శృతి హాసన్‌కు NBK 107 'స్పెషల్ బర్త్ డే విషెస్ (Instagram/Photo)


    ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ ‘అఖండ’ షూటింగ్‌లో బాలయ్యకు గాయం కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం  ఆలస్యమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో  కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.

    Prabhas - Adipurush : ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రపంచ రికార్డు.. ఇది కదా రెబల్ స్టార్ రేంజ్..

    ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే  పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం బాలయ్య.. సినిమాలతో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ షోకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఇది రికార్డులు తిరగరాస్తుంది. మన దేశంలో నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.  పైగా బాలయ్య హోస్టింగ్ కూడా కేక పెట్టిస్తుంది. తనను తాను చాలా మార్చుకున్నారు బాలయ్య. మహేష్ బాబు ఎపిసోడ్‌తో ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ముగియనుంది.

    ఈ రోజే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’ స్పెషల్‌ ప్రీమియర్.. ఈ సారి రచ్చ రంబోలా..

    త్వరలో బాలయ్య,  గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేయనున్నారట.ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

    HBD Shruti Haasan: ఈ జనరేషన్‌లో ఆ రెండు రికార్డ్స్ ఉన్న ఏకైక భారతీయ హీరోయిన్ ‘శృతి హాసన్’ మాత్రమే..

    ఈ సినిమాకు వేట పాలెం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ‘పెద్దాయన’ టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక బాలయ్య ఇమేజ్‌కు తగ్గ సరైన టైటిల్ అంటున్నారు అభిమానులు. ఒక హీరో పట్నానికి చెందిన వ్యక్తి అయితే.. మరోకరు ఊరిలో ఉన్న ’పెద్దాయన’. మొత్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అయితే.. అభిమానులకు అంత కన్నా ఆనందం ఉండదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, NBK 107, Shruti haasan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు