Home /News /movies /

HAPPY BIRTHDAY SAMANTHA SOME INTERESTING FACTS ABOUT SAMANTHA SR

Happy Birthday Samantha : అభాగ్యులకు అండగా సమంత.. ఈ లక్షణం అందరిలో చూడలేం..

చిన్నారులతో సమంత HBD Samantha Photo : Tiwtter

చిన్నారులతో సమంత HBD Samantha Photo : Tiwtter

Happy Birthday Samantha : ఈరోజు సమంత తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి అందరికి తెలియని ఓ విషయాన్ని చర్చిద్దాం.

    'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. అంతేకాదు తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. కాగా ఈరోజు సమంత తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి అందరికి తెలియని ఓ విషయాన్ని చర్చిద్దాం. సమంత ఎంత అందమో తన మనస్సు కూడా అంతే అందం. అందరికి సమంత ఓ హీరోయిన్’గానే తెలుసు. కానీ ఓ ఓ ఎన్ జి ఓ ను నడుపుతోంది. దీనికి కావాల్సిన డబ్బు, ఇతర అవసరాలను సమంత దగ్గరుండి చూసుకుంటోంది. సమంత 'ప్రత్యూష సపోర్ట్' అనే ఓ ఎన్ జి ఓ ను నడుపుతూ అక్కడ బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావాల్సిన వైద్య, విద్య ఖర్చులను భరిస్తూ చాలా కుటుంబాలకు సాయంగా నిలబడుతోంది. తన వంతుగా సాయం చేస్తూనే ఉంది. ఈ ప్రత్యూష సపోర్టు ద్వారా గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వీటితో పాటు ప్రాణాపాయ వ్యాధులకు కూడా ప్రత్యూష సపోర్టు ద్వారా వైద్యం అందిస్తున్నారు. సమంతలో మరో కోణం సామాజిక అంశాలపై స్పందించడం.. ఈ లక్షణం మనం అందరిలో చూడలేం.





    ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఆ మధ్య తమిళ హిట్ సినిమా 96కు తెలుగు రీమేక్‌గా వచ్చిన జాను సినిమా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పొచ్చు. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.



    ఈ వెబ్ సిరీస్‌ త్వరలో స్ట్రీమ్ కానుంది. ఇక సమంత నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సమంత తెలుగులో గుణశేఖర్ శాకుంతలంలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Samantha akkineni, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు