Home /News /movies /

HAPPY BIRTHDAY SAMANTHA RUTH PRABHU NEW LOOK FROM SHAKUNTALAM GETS GOOD RESPONSE SR

Happy Birthday Samantha Ruth Prabhu : శాకుంతలం నుంచి సమంత మరో లుక్‌‌ విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Samantha Ruth Prabhu new look from shakuntalam Photo : Twitter

Samantha Ruth Prabhu new look from shakuntalam Photo : Twitter

Happy Birthday Samantha Ruth Prabhu : ఆమె ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఫ్యాన్స్ బర్త్  డే విషెస్ తెలుపుతున్నారు. దీంతో ఆమె నటిస్తున్న శాకుంతలం నుంచి టీమ్ హ్యాపీ బర్త్ డే సమంత అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాకుంతలం (Shaakuntalam) సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Samantha Ruth Prabhu : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఆమె ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఫ్యాన్స్ బర్త్  డే విషెస్ తెలుపుతున్నారు. దీంతో ఆమె నటిస్తున్న శాకుంతలం నుంచి టీమ్ హ్యాపీ బర్త్ డే సమంత అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాకుంతలం (Shaakuntalam) సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha Ruth Prabhu )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

    సమంత ఈసినిమాకు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇతర పాత్రల్లో మోహన్ బాబు(Mohan Babu), సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, వర్షిణి సౌందరరాజన్ కనిపించబోతున్నారు. గుణ(Guna) టీమ్‌వర్క్స్, దిల్ రాజు(Dil raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నయనతార, సమంత కలసి నటిస్తోన్న చిత్రం కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal). ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత, నయన్, విజయ్ సేతుపతిల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా ‘టైటానిక్’‌లోని షిప్ సీన్‌, ‘బాహుబ‌లి-2’ ప్ర‌భాస్‌, అనుష్క బాణాలు వేసే సీన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా (Kanmani Rambo Khatija) డబ్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.


    ఇక సమంత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్‌తో పాటు దర్శకుడు శివ నిర్వాణ, గబ్బర్ సింగ దర్శకుడు హరీష్ శంకర్ హాజరైయ్యారు. ప్రేమకథ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్‌ని అనుకున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ అనే మలయాళీ సంగీత దర్శకత్వం వహించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Samantha Ruth Prabhu, Shakuntalam Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు