హోమ్ /వార్తలు /సినిమా /

HBD Roshan: టాలీవుడ్‌లో బుల్లెట్‌‌లా దూసుకొస్తోన్న శ్రీకాంత్ తనయుడు రోషన్..

HBD Roshan: టాలీవుడ్‌లో బుల్లెట్‌‌లా దూసుకొస్తోన్న శ్రీకాంత్ తనయుడు రోషన్..

హ్యాపీ బర్త్ డే రోషన్ మేక (Twitter/Photo)

హ్యాపీ బర్త్ డే రోషన్ మేక (Twitter/Photo)

HBD Roshan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక వారసత్వంలో తెలుగు సినీ ఇండస్డ్రీలో అడుగపెట్టి హీరోగా ఎదుగుతున్న నటుడు రోషన్ మేక. ఈ రోజు ఈ యువ నటుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

HBD Roshan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక వారసత్వంలో తెలుగు సినీ ఇండస్డ్రీలో అడుగపెట్టి హీరోగా ఎదుగుతున్న నటుడు రోషన్ మేక. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, మరియు నటి ఊహల పెద్ద కుమారుడు. అంతేకాదు తల్లిదండ్రుల నుంచి నటన వారసత్వాన్ని అంది పుచ్చుకొని టాలీవుడ్‌లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రోషన్ మేక విషయానికొస్తే.. శ్రీకాంత్, ఊహా దంపతులకు 13 మార్చి 1999లో హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడ విద్యాబ్యాసం పూర్తి చేసాడు. ఇంట్లో చిన్నప్పటి నుంచి సినీ వాతావరణం చూసి రోషన్ అడుగులు కూడా సినీ రంగంపై పడ్డాయి. అలా చిన్నపుడే గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రుద్రమదేవి’లో బాల నటడిగా తొలిసారి వెండితెరపై కనిపించారడు. ఈ చిత్రంలో బాల నటుడిగా కనిపించి తనదైన మార్క్ నటన చూపించాడు.

ఆ తర్వాత 2016లో  నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘నిర్వల కాన్వెంట్’ సినిమాలో నటించారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరుగా ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరోగా లీడ్ రోల్లో నటించిన సినిమాతోనే ఉత్తమ నటుడిగా SIIMA అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా రంగంలోని పలు విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు.

ఆ తర్వాత డాక్టర్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పెళ్లి సందడి’లో కథానాయకుడిగా నటించాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం మ్యూజికల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రోషన్ లుక్స్, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు.

పెళ్లి సందడి తర్వాత రోషన్ వైజయంతీ మూవీస్ మరియు వేదాంశ్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. దీంతో టాలీవుడ్‌కు బడా నిర్మాణ సంస్థలు రోషన్‌తో సినిమాలు నిర్మించడానికి క్యూ కడుతున్నాయి. ఐతే.. రోషన్ మాత్రం తన దగ్గరకు వచ్చే కథల్లో తనకు సూటయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. భవిష్యత్తులో మాస్ హీరోగా సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏది ఏమైనా వారసత్వంతో అడుగుపెట్టిన రోషన్.. భవిష్యత్తులో తెలుగులో మంచి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందకు ప్రిపేర్ అవుతున్నాడు. ఏది ఏమైనా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోషన్ మేకకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

First published:

Tags: Hero roshan, Srikanth, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు