Home /News /movies /

HAPPY BIRTHDAY RAO RAMESH KGF CHAPTER 2 AND MAHASAMUDRAM LOOK REVEALED TA

HBD Rao Ramesh: రావు రమేష్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2, మహా సముద్రం లుక్స్ విడుదల..

మహా సముద్రం, కేజీఎఫ్ 2లో రావు రమేష్ లుక్స్ (Twitter/Photos)

మహా సముద్రం, కేజీఎఫ్ 2లో రావు రమేష్ లుక్స్ (Twitter/Photos)

HBD Rao Ramesh: రావు గోపాల రావు తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రావు రమేష్.. విలక్షణ నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు రావు రమేష్ బర్త్ డే సందర్భంగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’, ‘మహా సముద్రం’ సినిమాల నుంచి రావు రమేస్ లుక్స్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    HBD Rao Ramesh: రావు గోపాల రావు తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రావు రమేష్.. విలక్షణ నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగారు. కామెడీ, యాక్షన్ ఇలా పాత్ర ఏదైనా తన  యాక్టింగ్‌తో దాని అంతు చూడటంతో రావు రమేష్ స్టైలే వేరు. రావు రమేష్ ప్రతిభ కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. ఈయన తమిళం, కన్నడ వంటి పలు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఈయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కేజీఎఫ్ 2’లో కన్నెగంటి రాఘవన్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

    భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మూవీ మేకర్స్ గత కొన్నేళ్లు కేజీఎఫ్ టైమ్స్  అంటూ ఓ మ్యాగజైన్‌‌ను విడుదల చేస్తున్నారు.

    KGF Chapter 2లో కన్నెగంటి రాఘవన్ పాత్రలో రావు రమేష్ (Twitter/Photo)


    ఈ రోజు రావు రమేష్ బర్త్ డే సందర్భంగా రావు రమేష్.. కన్నెగంటి రాఘవన్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రకు సంబంధించిన మ్యాగజైన్ విడుదల చేసారు. ఈ సినిమాలో యశ్ (రాఖీ)ను పట్టుకోవాలనుకునే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.


    మరోవైపు రావు రమేష్.. ‘మహా సముద్రం’ సినిమాలో గూనీ బాబ్జీ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ను రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

    ‘మహా సముద్రం’లో గూని బాబ్జీగా రావు రమేష్ (Twitter/Photo)


    శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రావు రమేష్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్రలో రావు రమేష్ గూనీ బాబ్జీ పాత్రలో అద్భుతమైన మేకోవర్‌లో నెగిటివ్ షేడ్స్  ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్స్.. ఆయా సినిమాలపై అంచనాలు పెంచుతున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: KGF Chapter 2, Rao ramesh, Sandalwood, Tollywood

    తదుపరి వార్తలు