మొన్న శ్రీముఖి, ఈరోజు అనసూయ..పండుగ చేసుకుంటున్న అభిమానులు

అనసూయ భరద్వాజ్..జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు శ్రీముఖి కూడా పటాస్ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. అయితే పాపులర్ యాంకర్స్ ఇద్దరూ మూడు నాలుగు రోజుల వ్యవధిలో పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 6:37 PM IST
మొన్న శ్రీముఖి, ఈరోజు అనసూయ..పండుగ చేసుకుంటున్న అభిమానులు
శ్రీముఖి, అనసూయ
news18-telugu
Updated: May 15, 2019, 6:37 PM IST
అనసూయ భరద్వాజ్..జబర్థస్త్ షోలో యాంకరింగ్‌తో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రపంచంలో తెలుగు టీవీని వీక్షించే వారేవరైన అనసూయను ఖచ్చితంగా గుర్తుపట్టాల్సిందే. ఆమె అంతా పాపులర్. టీవీల్లో రోజు ఏదో ఒక ప్రోగ్రామ్‌లో వస్తూ తెలుగువారికి చాలా దగ్గరైంది. తన అందంతో పాటు..చురుకైన మాటలతో అందర్నీ తనవైపుకు ఆకర్షిస్తుంది భామ. ఇటూ టీవీల్లో యాంగరింగ్ చేస్తూనే..అటూ సినిమాల వైపు కూడా ఓ చూపు వేసింది. దాని ఫలితమే 'క్షణం'లో ఆమె చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇరగదీసింది. ఆ తర్వాత అడపా దడపా కొన్ని సినిమాల్లో చేసిన రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో రంగమ్మత్తగా ఎంతగా ఆకట్టకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. అనసూయను తప్ప..ఆ పాత్రలో ఇంకోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది అనసూయ. ఈ సినిమాలో తన పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో యాక్ట్ చేయబోతుంది. ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటోన్న ఈ భామ.. 34 ఏట అడుగుపెట్టింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఈ భామ.. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో ఇటు టీవీ, అటు సినీ రంగంలో తన దూకుడు చూపిస్తోంది.

అనసూయ Photo: Instagram


మరోవైపు శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి..పటాస్ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా న‌టించిన శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టింది.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా తెలుగులో చ‌క్రం తిప్పుతుంది. అది అలా వుంటే ఇటీవలే శ్రీముఖి తన పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. శ్రీముఖి పుట్టిన రోజున యాంకర్ అనసూయ తన ట్వీటర్ వేధికగా ..శ్రీముఖికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.


Loading...
ఈ సందర్బంగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..తెలుగు యాంకర్స్‌లో అందరికంటే వయసులో చిన్న దానివి..ఇలానే యాంకరింగ్ చేస్తూ..ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.. నీకు చెప్పాల్సిన అవసరం లేదు..ఈరోజు పుల్‌గా కేకులు తిను..హగ్స్..అంటూ రెండు స్మైలీలు పోస్ట్ చేసింది అనసూయ. దీనికి ప్రతి స్పందనగా ఈరోజు అనసూయ పుట్టిన రోజున శ్రీముఖి కూడా ట్విటర్ వేధికగా..అనసూయకు శుభాకాంక్షలు తెలిపింది. 'హ్యాపీ బర్త్‌డే అనసూయ.. భవిష్యత్తులో మంచి మంచి పాత్రలు చేయాలి రంగమ్మత్త' అంటూ ఓ పోస్ట్ చేసింది శ్రీముఖి.

యాంకర్ శ్రీముఖి
అయితే మొన్న శ్రీముఖి పుట్టినరోజు..ఈ రోజు అనసూయ పుట్టినరోజు జరుపుకోవడంతో అటూ పటాస్ అభిమానులు, ఇటూ  జబర్థస్త్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో ఇలా తమ అభిమాన యాంకర్స్ పుట్టినరోజును జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ..సోషల్ మీడియా వేధికగా తమ ఆనందాన్ని శుభాకాంక్షల రూపంలో తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...