రామ్ పోతినేని.. ఇస్మార్ట్ శంకర్ లాంటీ సినిమాతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఎనర్జిటిక్ స్టార్. రామ్ ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో రామ్ ఇండస్ట్రీలోకి అడిగుపెట్టిన, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. రామ్ 1987 మే 15వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. రామ్.. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కుమారుడు. అంటే రామ్‌కు స్రవంతి రవికిషోర్ అంకుల్ అవుతారు. ఇక దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రామ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చక్రి అందించిన సంగీతం సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించింది. ఆమెకు కూడా ఇదే తొలి సినిమా. ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని, అటు ఇలియానాకు ఇటు రామ్‌కు ఓ మంచి బేస్‌ను ఏర్పాటు చేసింది. ఈ సినిమాలో రామ్ కూడా ఎక్కడా తడబడకుండా అదరగొట్టారు. ఈ సినిమా రామ్ కి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. ఇక ఆ తర్వాత తన రామ్ తన రెండవ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేశాడు. సుకుమార్ అప్పటికే ఆర్య లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం 2007 మార్చి 16వ తేదీన విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ గూజ్ బంప్స్‌ను కలిగిస్తాయి.
ఇక ఆ తర్వాత 2008లో వచ్చిన రెడీ మంచి విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా.. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత పలు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా తన లో దాగి ఉన్న మరొక మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతుంటే థియేటర్స్ ఊగిపోయాయి. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రెడ్ అంటూ వచ్చారు. ఈ సినిమా తమిళ సినిమా తడమ్‌కు రీమేక్‌గా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక రామ్ పోతినేని నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించారు రామ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించనుంది. లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవాారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లాంగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.
ఇక తాజాగా రామ్ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌తో సినిమా చేయడానికి బోయపాటి ఓ మాస్ కథను సిద్ధం చేశాడని సమాచారం. అయితే బోయపాటి సినిమా, లింగుస్వామి సినిమా తర్వాత ఉండనుంది. ఇక ఈరోజు రామ్ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఫ్యాన్స్..తో ఇండస్ట్రీ ప్రముఖులు బర్త్ డే విషేస్ తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news